AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. నెలకు రూ. 80 వేల జీతం..

BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ పలు విభాగాల్లో ఉన్న మొత్తం 1312 ఖాళీలను భర్తీ చేయనుంది...

BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. నెలకు రూ. 80 వేల జీతం..
Narender Vaitla
|

Updated on: Aug 18, 2022 | 9:51 AM

Share

BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ పలు విభాగాల్లో ఉన్న మొత్తం 1312 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 1312 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) – 982, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) – 330 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి/ITI, రేడియో & టెలివిజన్ లేదా ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ ఆపరేటర్/జనరల్ ఎలక్ట్రానిక్స్/డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా 60% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) పోస్టులకు అప్లై చేసుకునే వారు రేడియో అండ్ టెలివిజన్/ఎలక్ట్రానిక్స్/ఫిట్టర్/10 ఉత్తీర్ణత/ITI సర్టిఫికేట్/కంప్యూటర్ సాఫ్ట్‌వేర్/ జనరల్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ హార్డ్‌వేర్/నెట్‌వర్క్ టెక్నీషియన్/డేటా ఎంట్రీ ఆపరేటర్/ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 12వ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ (PST) అండ్ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME) ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 20-08-2022న మొదలుకాగా 19-09-2022తో చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్