Hyderabad: డ్రగ్స్ ముఠా కలకలం.. హబ్సీగూడలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు.. దర్యాప్తులో కీలక విషయాలు

హైదరాబాద్ (Hyderabad) మహానగరం నేరాలకు అడ్డాగా మారుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నేరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. హత్యలు, దాడులు, చోరీలు, అత్యాచారాలు ఇలా అనేక రకాల క్రైమ్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా డ్రగ్స్...

Hyderabad: డ్రగ్స్ ముఠా కలకలం.. హబ్సీగూడలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు.. దర్యాప్తులో కీలక విషయాలు
Drugs
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 18, 2022 | 6:50 AM

హైదరాబాద్ (Hyderabad) మహానగరం నేరాలకు అడ్డాగా మారుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నేరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. హత్యలు, దాడులు, చోరీలు, అత్యాచారాలు ఇలా అనేక రకాల క్రైమ్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా డ్రగ్స్ (Drugs) వ్యవహారం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో అరెస్టైన గోవా డ్రగ్‌ పెడ్లర్‌ నారాయణ్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. 600 మంది కస్టమర్లలో 166 మంది హైదరాబాదీలే ఉండటం గమనార్హం. హైదరాబాద్‌ అడ్డాగా డ్రగ్స్‌ దందా విచ్చలవిడిగా సాగుతోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, కఠిన చర్యలు తీసుకుంటున్నా, రహస్యంగా గుప్పుమంటోందీ మత్తు బిజినెస్‌. ఐదు రోజుల క్రితమే భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టు-రట్టు చేసిన పోలీసులు, ఇప్పుడు మరో ముఠాను పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల గ్యాంగ్‌ లీడర్‌ పి.నారాయణ్‌ బొర్కార్‌ను హబ్సిగూడలో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 5 బాటిల్స్‌ LSD, 4 గ్రాముల MDMA, 20 ఎక్టాసీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈస్ట్‌జోన్‌ డీసీపీ చక్రవర్తి(byte-20 seconds). గోవాలో నివాసముండే నారాయణ్‌ బొర్కార్‌ మజూర్‌, పార్కర్‌తో కలిసి డ్రగ్స్‌ బిజినెస్‌ చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. తుకారం, వికాస్‌, రమేష్‌, అద్విన్‌, సంజయ్‌ ముఠా నుంచి డ్రగ్స్‌ కొనుగోలుచేసి సప్లై చేస్తున్నాడు.

నారాయణ్‌ బొర్కార్‌ ఎనిమిదేళ్లుగా డ్రగ్స్ బిజినెస్‌ చేస్తున్నాడని, ఇతనికి ఆరు వందల మంది కస్టమర్స్‌ ఉంటే, అందులో 166 మంది హైదరాబాద్‌ వాళ్లే ఉన్నారని గుర్తించారు. నారాయణ్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వాళ్లందరినీ విచారిస్తామని వెల్లడించారు. నారాయణ్‌ గోవాలో చాలా ఫేమస్‌ అవడంతో ఎక్కడ రేవ్‌ పార్టీ జరిగినా ఇతని నుంచే డ్రగ్స్‌ సప్లై జరుగేదని చెప్పారు. హైదరాబాద్‌ కస్టమర్లను గోవాకు పిలిచి మాత్రమే డ్రగ్స్‌ ఇచ్చే నారాయణ్‌.. అవసరం అనుకుంటేనే డైరెక్ట్‌ డెలివరీ ఇస్తాడని తెలిపారు. అలా వచ్చే హబ్సిగూడలో పోలీసులకు దొరికాడు.

డ్రగ్స్‌కు మళ్లీ హైదరాబాద్‌ అడ్డాగా మారుతోందా? కంట్రోల్‌లోకి వచ్చిందనుకున్నా మత్తు దందా మళ్లీ ఊపందుకుందా? డ్రగ్‌ పెడ్లర్స్‌ వరుస అరెస్టులు దేనికి సంకేతం? నలుగైదు రోజుల గ్యాప్‌లో మరో ముఠా దొరకడం కలకలం రేపుతోంది. ఈ ప్రశ్నలు నగరవాసుల మెదళ్లను తొలిచివేస్తున్నాయి. ఇలాంటి నేరాలను అరికట్టి శాంతియుత సమాజాన్ని నిర్మించాలని నగరవాసులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం  ఈలింక్ క్లిక్ చేయండి