Telangana: జనగామ జిల్లాలో హీటెక్కిన ఫ్లెక్సీ వార్.. బండి సంజయ్‌కు సవాల్ విసురుతూ..
Telangana: ఫ్లెక్సీ వార్‌తో జనగామ జిల్లా హీటెక్కింది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీపోటీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు.. ఒక్కసారిగా రాజకీయ రగడకు తెరతీసాయి. జనగామ జిల్లాలో బండి సంజయ్..
Telangana: ఫ్లెక్సీ వార్‌తో జనగామ జిల్లా హీటెక్కింది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీపోటీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు.. ఒక్కసారిగా రాజకీయ రగడకు తెరతీసాయి. జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ప్రకంపనలు రేపుతుంది.
జనగామ జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. జనగామా జిల్లాలో టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రవేశించిన తరుణంలో.. ఆయనకు సవాళ్లు విసురుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేరుతో హోర్డింగ్‌లు పెట్టారు. తెలంగాణకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చాకే జనగామలో అడుగుపెట్టాలంటూ ప్లెక్సీల రూపంలో డిమాండ్ చేశారు. దీంతో జనగామలో పెక్సీవార్ హీటెక్కింది.
మరోవైపు బండి సంజయ్ పాదయాత్రను స్వాగతిస్తూ బీజేపీ నేతలు జనగామ పట్టణంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు టీఆర్ఎస్ హోర్డింగ్‌లు, ఇటు కాషాయం ఫ్లెక్సీలతో జనగామ టౌన్ నిండి పోయింది. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు రాజకీయ హైటెన్షన్ రాజేశాయి. ఇదిలాఉంటే.. జనగామ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో బీజేపీలో ఆధిపత్య పోరు బయటపడింది. బండి సంజయ్ పాదయాత్ర రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రెండు వర్గాలు చించేసుకున్నాయి. బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత తిరుపతి రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరే ఇందుకు కారణంగా చెప్తున్నారు పార్టీ శ్రేణులు. కాగా, పెక్లీల రగడ ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేశాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..