Tea Bags: టీ బ్యాగ్‌లతో తయారు చేసిన టీ తాగుతున్నారా? ఈ సమస్యలున్నవారు తాగితే అంతే సంగతులు..

బిజీ లైఫ్‌ షెడ్యూల్‌ మూలంగా మనలో చాలా మంది రోజువారీ ఆహారంపై అంతగా శ్రద్ధ పెట్టరనేది కాదనలేని నిజం. జీవనశైలి మూలంగా అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అందుకు గల ప్రధాన కారణాల్లో రోజూ తాగే టీ బ్యాగ్‌లు కూడా ఒకటి..

Tea Bags: టీ బ్యాగ్‌లతో తయారు చేసిన టీ తాగుతున్నారా? ఈ సమస్యలున్నవారు తాగితే అంతే సంగతులు..
Tea Bag Side Effects
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 18, 2022 | 9:36 PM

This is why using tea bags can be harmful for your health! బిజీ లైఫ్‌ షెడ్యూల్‌ మూలంగా మనలో చాలా మంది రోజువారీ ఆహారంపై అంతగా శ్రద్ధ పెట్టరనేది కాదనలేని నిజం. జీవనశైలి మూలంగా అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అందుకు గల ప్రధాన కారణాల్లో రోజూ తాగే టీ బ్యాగ్‌లు కూడా ఒకటి. బరువు తగ్గడానికి, ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనే తపనతో యువకుల నుంచి వృద్ధుల వరకు అనేక మంది టీ బ్యాగ్‌లను వినియోగిస్తున్నారు. ఇక మార్కెట్లో అనేక బ్రాండ్‌ల టీ బ్యాగ్‌లు అందుబాటులో ఉంటున్నాయి. ఐతే ఈ విధమై టీ బ్యాగ్‌లతో టీ తయారు చేసుకుని తాగితే అనేక దుష్ర్పభావాలు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏయే వ్యక్తులు టీ బ్యాగ్‌లతో తయారు చేసిన టీకి దూరంగా ఉండాలి? టీ తాగేటప్పుడు గుర్తుంచుకోవల్సిన ముఖ్య విషయాలు మీకోసం..

మధుమేహ రోగులు టీ బ్యాగ్‌లతో టీని తాగకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని డిస్టర్బ్‌ చేస్తుంది. ఎక్కువ కెఫిన్ ఉన్న టీ బ్యాగ్‌లు డయాబెటిక్ రోగి ఆరోగ్యానికి మరింత హాని కలిగిస్తాయి. అందువల్ల మీరు షుగర్ పేషెంట్ అయితే టీ బ్యాగ్‌లు తాగడానికి ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.

నిద్రలేమి సమస్యతో బాధపడే వ్యక్తులు కూడా టీ బ్యాగ్‌లను తాగకూడదు. కెఫిన్ అధికంగా వినియోగిస్తే నిద్రలేమికి కారణమవుతుంది. చిన్న వయస్సులోనే పిల్లలు బరువు పెరిగితే.. తల్లిదండ్రులు టీ బ్యాగ్‌తో తయారు చేసిన టీ తాగిపిస్తే క్రమంగా పిల్లల బరువు తగ్గుతారు. ఐతే ఈ ట్రిక్ పాటించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

హెర్బల్ టీని రొటీన్‌లో చేర్చాలనుకుంటే.. ఎల్లప్పుడూ నీళ్లలో మరిగించి మాత్రమే టీ తయారు చేసుకోవాలి. నీళ్లలో మరిగించడం మూలంగా దానిలోని మూలకాలు నీటిలో బాగా కలుస్తాయి. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగినా టీ ఆకులను నీటిలో ఉడకబెట్టడం మర్చిపోకూడదు.