AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: లైంగిక ఆరోగ్యానికి లవంగాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఇంకా ఏమేం ఉపయోగాలున్నాయో తెలుసా

సుగంధ ద్రవ్యాల్లో విరివిగా ఉపయోగించే లవంగం (Cloves) ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఘాటైన సువాసనతో ఔషధ గుణాలు పుష్కలంగా కలిగి ఉన్న లవంగాలు మసాలా దినుసుల డబ్బాలో కనిపించే ముఖ్యమై..

Health: లైంగిక ఆరోగ్యానికి లవంగాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఇంకా ఏమేం ఉపయోగాలున్నాయో తెలుసా
Cloves
Ganesh Mudavath
|

Updated on: Aug 19, 2022 | 7:16 AM

Share

సుగంధ ద్రవ్యాల్లో విరివిగా ఉపయోగించే లవంగం (Cloves) ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఘాటైన సువాసనతో ఔషధ గుణాలు పుష్కలంగా కలిగి ఉన్న లవంగాలు మసాలా దినుసుల డబ్బాలో కనిపించే ముఖ్యమై పదార్థం. వీటిని బిర్యానీ లో వేసుకున్నా, నాన్ వెజ్ ఐటమ్స్ లో జోడించినా ఆ రుచి, వాసన వేరు. అంతే కాకుండా లవంగాలు కండరాల నొప్పులను తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. లవంగం నూనె ద్వారా అధ్భుత (Health Benefits) ప్రయోజనాలున్నాయి. వివిధ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో, మూత్ర సంబంధిత రుగ్మతలను నయం చేయడంలో లవంగం సహాయపడుతుంది. దంత చిగుళ్ల ఇన్ఫెక్షన్‌లకు కారణమవుతుందని భావించే పీరియాంటల్ పాథోజెన్స్ వంటి నోటిలోని బాక్టీరియా నుంచి రక్షిస్తుంది. ఇందులో యూజినాల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది దంతాలను క్షయం నుంచి కాపాడుతుంది. సైనస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా అరికడుతుంది. లవంగాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నందున.. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అపానవాయువు, అజీర్ణం, అతిసారం, మలబద్ధకం, గ్యాస్, ఆకలి లేకపోవడం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలు శరీరంలోని ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

లవంగాలను తీసుకోవడం వల్ల శరీరంలో తెల్ల రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. లవంగాల వాడకం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. లవంగం నూనెలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేద వైద్యం ప్రకారం కఫా-పిత్త దోషాన్ని తగ్గించేందుకు లవంగాలు మంచి పదార్థాలుగా నిర్ధరణ అయింది. దీనిని మితమైన మోతాదులో తీసుకోవడం వల్ల ఆకలి, కడుపులో గ్యాస్, వాంతులు-వికారం, రక్త రుగ్మతలు, శ్వాస, ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయ, దంతాలు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. పురుషుల లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..