Health: డయాబెటిస్ బాధితులకు అలర్ట్.. విపరీతమైన దాహం వేస్తోందా.. ఈ వ్యాధులు చుట్టుముట్టొచ్చు జాగ్రత్త

భూమిపై నివసించే సమస్త మానవాళికి నీరు (Water) అత్యంత అవసరమైనది. నీరు లేనిదే ఏ జీవీ మనుగడ సాధించలేదు. నీరు లేని జీవితాన్ని ఊహించలేం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ జీవించడం సులభతరం అవుతుందని మనందరికీ తెలిసిందే. ఇది..

Health: డయాబెటిస్ బాధితులకు అలర్ట్.. విపరీతమైన దాహం వేస్తోందా.. ఈ వ్యాధులు చుట్టుముట్టొచ్చు జాగ్రత్త
Thirsty
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 19, 2022 | 7:47 AM

భూమిపై నివసించే సమస్త మానవాళికి నీరు (Water) అత్యంత అవసరమైనది. నీరు లేనిదే ఏ జీవీ మనుగడ సాధించలేదు. నీరు లేని జీవితాన్ని ఊహించలేం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ జీవించడం సులభతరం అవుతుందని మనందరికీ తెలిసిందే. ఇది మన శరీరానికి ఎంతో ఆరోగ్యం (Health) అందిస్తుంది. తక్కువ నీరు తాగే వ్యక్తులకు మలబద్ధకం సహా అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే నీరు తక్కువగా తాగితే చర్మం నల్లగా కనిపిస్తుంది. అయితే ఎక్కువగా దాహం వేయడం శరీరానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది మన శరీరంలో ఏర్పడే కొన్ని వ్యాధులు లేదా సమస్యలకు సంకేతం. ప్రస్తుతం భారతదేశంలో డయాబెటిస్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జీవనశైలి మార్పుల వల్ల అధిక దాహానికి దారి తీస్తుంది. రోగికి తరచుగా మూత్రవిసర్జన చేయాలని అనిపిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయి క్షీణించినప్పుడు అధికంగా దాహం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దాహం ఎక్కువగా వేస్తే రక్తంలో చక్కెర లెవెల్స్ ను పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు. గర్భం కారణంగా గర్భిణీ స్త్రీ ఆరోగ్యంలో అనేక మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. నేటి కాలంలో గర్భిణీ స్త్రీలకూ మధుమేహం వస్తోంది.

గర్భధారణ సమయంలో అధికంగా నీళ్లు తాగడం సహజమే. కానీ అధిక దాహంతో బాధపడుతుంటే మాత్రం కచ్చితంగా డాక్టర్ల సలహా తీసుకోవాల్సిందే. డీహైడ్రేషన్‌తో బాధపడేవారికి విపరీతమైన దాహం మొదలవుతుంది. శరీరంలో నీటి కొరత ఏర్పడితే దాహం ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య వేసవిలో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, వర్షాకాలంలో లేదా శీతాకాలంలో కూడా దీనిని ఎదుర్కోవలసి ఉంటుంది. డీహైడ్రేషన్ ప్రభావం చర్మం మరియు జుట్టు మీద కూడా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు