AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: నీరు ఎక్కువ తాగుతున్నారా.. ? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!!

ఓవర్‌హైడ్రేషన్ కూడా ప్రమాదకరమే. ఎక్కువ నీరు త్రాగడం వల్ల మీ రక్తప్రవాహంలో అసాధారణంగా తక్కువ స్థాయి సోడియం, ఇతర ఎలక్ట్రోలైట్‌లు ఏర్పడతాయి. ఇది అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు.

Health Tips: నీరు ఎక్కువ తాగుతున్నారా.. ? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!!
Cold Water
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2022 | 9:07 AM

Share

Health Tips: మన శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత నీరు అవసరం.కానీ, ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఓవర్‌హైడ్రేషన్ కూడా ప్రమాదకరమే. ఎక్కువ నీరు త్రాగడం వల్ల మీ రక్తప్రవాహంలో అసాధారణంగా తక్కువ స్థాయి సోడియం, ఇతర ఎలక్ట్రోలైట్‌లు ఏర్పడతాయి. ఇది అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. శరీరానికి నిరంతరం నీటిని జోడించడం వల్ల మీ రక్తంలో సోడియం స్థాయిని తగ్గిస్తుంది. ఇది మీ శరీర కణాలలో వాపుకు కారణమవుతుంది. ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల కలిగే సంకేతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

మీ శరీరంలో కలిగే ఈ మార్పులు మీరు ఓవర్ హైడ్రేట్‌గా ఉన్నారని సూచిస్తున్నాయి. – ఎక్కువ నీరు తాగడం వల్ల మన శరీరంలో ద్రవం పెరిగి.. సమతుల్యత ఏర్పడుతుంది. ఎక్కువ నీటిని తాగటం వల్ల మన శరీరంలో ఉండే ఉప్పు స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా వికారం, అలసట, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

– మనం ప్రతి రోజూ ఎక్కువ నీటిని తాగితే ఎలక్ట్రోలైట్ స్థాయిలో పడిపోతాయి. దీంతో బ్యాలెన్స్ తప్పి శరీరం షేక్ అవుతుంది. ఎలక్ట్రో స్థాయిలు తక్కువగా అయినప్పుడు కండరాల నొప్పి ,తిమ్మిరి వంటివి సంభవిస్తాయి.

ఇవి కూడా చదవండి

– ఎక్కువ నీరు తాగడం వల్ల ప్రతిసారి కూడా అలసట నీరసం వస్తూ ఉంటుంది. ఎక్కువ నీరు తాగితే మూత్రపిండాలు చాలా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. దీనివలన మనకు ఒత్తిడి ఏర్పడుతుంది.. దీని వల్ల హార్మోన్ల ప్రతిచర్య ఆందోళనలకు గురవుతుంది.

– ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మూత విసర్జన చేయడం చాలా అన్ఈజీగా ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

అయితే సాధారణంగా ప్రతిరోజు 3, 4 లీటర్ల నీళ్లు తాగాలని చెపుతుంటారు. కానీ,.. అంద‌రికీ ఆ సూత్రం పనిచేయదని, బాగా దాహం అయ్యేవారు మాత్ర‌మే నీటిని తాగాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇత‌రులు క‌చ్చితంగా 8 గ్లాసుల నీటిని రోజుకు తాగాల్సిన నియమం ఏమి లేదంటున్నారు. మ‌న‌కు నీరు ఎంత కావాలో నిర్ణ‌యించుకునే వ్య‌వ‌స్థ కూడా మ‌న శ‌రీరంలో ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి