Monkey pox: మంకీపాక్స్‌పై బాంబ్‌ పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వ్యాక్సిన్‌ వంద శాతం సురక్షితం కాదంటూ వ్యాఖ్య..

Monkey pox: కరోనా మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలిగిపోకముందే ఇప్పుడు మరో కొత్త వ్యాధి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పుడు ప్రపంచాన్ని మంకీపాక్స్‌ భయపెడుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి...

Monkey pox: మంకీపాక్స్‌పై బాంబ్‌ పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వ్యాక్సిన్‌ వంద శాతం సురక్షితం కాదంటూ వ్యాఖ్య..
Monkey Pox
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 19, 2022 | 7:15 AM

Monkey pox: కరోనా మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలిగిపోకముందే ఇప్పుడు మరో కొత్త వ్యాధి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పుడు ప్రపంచాన్ని మంకీపాక్స్‌ భయపెడుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం మంకీపాక్స్‌ ఇప్పటి వరకు 92 దేశాలకు వ్యాపించగా.. 35 వేలకుపైగా కేసులు నమోదయ్యారు. ఈ వైరస్‌ కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన కేవలం వారం రోజుల్లోనే 7,500 కేసులు నమోదుకావడం గమనార్హం.

మంకీపాక్స్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్లకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మంకీపాక్స్‌ వ్యాక్సిన్ వంద శాతం సురక్షితమేమీ కాదని తేల్చి చెప్పింది. దీంతో మంకీపాక్స్‌ భయం మరింత పెరిగింది. ఇక కేసులు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్ టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మంకీపాక్స్‌ వ్యాక్సిన్‌ వంద శాతం సురక్షితం కాదని, ప్రజలు వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమం అని సూచించారు.

గతం వారంతో పోలిస్తే కేసులు ఏకంగా 50 శాతం పెరిగాయని టెడ్రోస్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. నిత్యం శానిటైజేషన్‌ చేసుకోవడం, మాస్క్‌లు ధరించడం వంటివి పాటించాలని తెలిపారు. ఇదిలా ఉంటే భారత్‌లోనూ మంకీపాక్స్‌ చాప కింద నీరులా వ్యాపిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశంలో 10 కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించిన విషయం తెలిసిందే.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే