Warangal: ఇదేం దొంగతనం రా బాబు.. ఇంటి గేట్ ఎత్తుకెళ్లారు..! కానీ,ఈ ట్విస్ట్ ఉహించి ఉండరు..

ఇటీవలి దొంగలు చిత్ర విచిత్ర దొంగతనాలు చేస్తూ పోలీసులను సైతం ఆశ్చర్య పడేలా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎలా దొంగతనం చేసినా...ఎలాంటి వస్తువులను దొంగిలించిన నిఘానేత్రం నుండి తప్పించుకోలేక.. పోలీసులకు చిక్కుతున్నారు.

Warangal: ఇదేం దొంగతనం రా బాబు.. ఇంటి గేట్ ఎత్తుకెళ్లారు..! కానీ,ఈ ట్విస్ట్ ఉహించి ఉండరు..
Thieves
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 19, 2022 | 7:48 AM

Warangal: ఇటీవలి కాలంలో దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోయాయి.. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. నడి రోడ్డు మీదనే దొంగతనాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వాళ్ళను అడ్డగిస్తే చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇక ఎప్పటికప్పుడు వాళ్లు దొంగతనం చేసే రూట్ కూడా మారుస్తున్నారు. కొత్త కొత్త వస్తువులను దొంగతనం చేస్తూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇలా దొంగలు కూడా చిత్ర విచిత్రంగా దొంగతనాలు చేస్తూ పోలీసులను సైతం ఆశ్చర్య పడేలా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎలా దొంగతనం చేసినా…ఎలాంటి వస్తువులను దొంగిలించిన నిఘానేత్రం నుండి తప్పించుకోలేక.. పోలీసులకు చిక్కుతున్నారు. ఇకపోతే, వరంగల్‌ నగరంలోనూ ఇలాంటి విచిత్ర దొంగతనం చేసిన కేటుగాళ్లు రోజుల వ్యవధిలోనే పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే..

వరంగల్ నగరంలోని నాయుడు పెట్రోల్ పంపు దగ్గర వెల్డింగ్ షాప్ లో ఆగస్టు 15 రాత్రి చోరీ జరిగింది. దుకాణంలోని రూ. 6 వేల విలువ గల ఇనుప గేట్ ను దొంగలు ఎత్తుకుపోయినట్లు యజమాని ఎండీ మాజిద్ మామునూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బోల్లికుంట క్రాస్ వద్ద కొన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానితులుగా ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో పోలీసులు వారిని విచారించగా అసలు విషయం తెలిసింది.

ఈ ముఠా ఇటీవలి కాలంలో ఇనుప గేట్లు దొంగతనం చేసి అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. వారి నుండి తొర్రూర్ లో దొంగతనం చేసిన గేట్లను, నాయుడు పంపు వద్ద వెల్డింగ్ షాప్ లో దొంగలించిన ఇనుప గేట్లు, గ్రిల్స్ ను, తరలించడానికి ఉపయోగించిన టాటా ఏసీ వాహనం సీజ్‌ చేశారు. ఈ మేరకు సీఐ క్రాంతికుమార్ వివరాలు వెల్లడించారు. త్వరితగతినఈ కేసును చేదించిన కృష్ణవేణి, కానిస్టేబుల్స్ ను సీఐ అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!