Mobile snatching: రైలు గేటు పడింది కాదా అని.. సెల్‌ఫోన్‌లో సొల్లు పెడితే ఇట్టాగే ఉంటది మరీ.. దొంగోడిది ఏం టైమింగ్‌ కదా..!

ఎక్కడ చూసినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియోలో కనిపిస్తున్న చోరీ ఘటన ఒక విధంగా అందరికీ గుణపాఠం. ఈ వీడియో

Mobile snatching: రైలు గేటు పడింది కాదా అని.. సెల్‌ఫోన్‌లో సొల్లు పెడితే ఇట్టాగే ఉంటది మరీ.. దొంగోడిది ఏం టైమింగ్‌ కదా..!
Mobile Snatching
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 17, 2022 | 1:50 PM

Mobile snatching: దొంగలు చాలా తెలివిమీరిపోతున్నారు. చైన్‌స్నాచింగ్‌లు, మొబైల్‌ చోరీలు, గుడి,బడి, ఇళ్లు, ఆఫీసులు ఏదీ వదిలిపెట్టడంలేదు..ఇక ఇలాంటి దొంగలు కూడా ఉంటారు..ఇక్కడ జరిగిన మొబైల్‌ చోరీ చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు. ఇలాంటి అనేక సంఘటనలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటాయి. ఇలాంటి షాకింగ్‌ వీడియోలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, రైల్వే ట్రాక్‌కి అవతలి వైపు రైలు వెళ్లడానికి చాలా మంది వేచి ఉండటం చూడవచ్చు. అయితే అవకాశం చూసి ఓ దొంగ అక్కడికి వచ్చి మొబైల్ మాట్లాడుతున్న వ్యక్తి చేతిలో నుంచి సెల్‌ ఫోన్ లాక్కొని పారిపోతాడు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కదిలించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చాలా మంది రైల్వేగేటు దాటేందుకు నిలబడి ఉన్నారు.  రైల్వే ట్రాక్‌కి ఒక వైపు నిలబడి రైలు వెళ్లే వరకు ఎదురు చూస్తున్నారు. అంతలోనే రైలు పట్టాల దాటుకుని ఓ యువకుడి జనం ఉన్న వైపుకు వచ్చాడు..రద్దీగా ఉన్న ఆ ప్రదేశంలో అటూ ఇటూ కాసేపు తచ్చాడుతూ ఉండగా, ఓ మరో యువకుడు బైక్‌పై కూర్చుని ఫోన్‌ మాట్లాడుతున్నాడు. అదును అతడి చేతిలో నుండి ఫోన్ లాక్కునిపరిగెత్తాడు. పాపం బాధితుడు మొబైల్‌ దొంగను పట్టుకునేందుకు పరిగెత్తిన ఫలితం లేకుండా పోతుంది. అప్పటికే అట్నుంచి రైలు కూతపెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఈ విధంగా మొబైల్‌ను లాక్కోని పారిపోవడంతో ఆ దొంగ సక్సెస్‌ అయ్యాడు మరీ.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by SAKHT LOGG ? (@sakhtlogg)

ఎక్కడ చూసినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియోలో కనిపిస్తున్న చోరీ ఘటన ఒక విధంగా అందరికీ గుణపాఠం. ఈ వీడియో sakhtlogg అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. వీడియో క్యాప్షన్‌లో దొంగోడి ఏం టైమింగ్‌ రా… అంటూ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి