AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొత్త జంటకు బంధువుల వింత ప్రశ్న..! సిగ్గుతో ఊగిపోయిన నవవధువు..వీడియో చూడాల్సిందే..

చివరికి ఈ ప్రశ్నకు వధువు ముఖం సిగ్గుతో ఎర్రబడటం,పెళ్లికి వచ్చిన అతిథులందరూ తెగ నవ్వుకోవటం కనిపిస్తుంది. వధువు తర్వాత అడ్డంగా తల ఊపుతూ.. మెల్లిగా నవ్వడం ప్రారంభిస్తుంది.

Viral Video: కొత్త జంటకు బంధువుల వింత ప్రశ్న..! సిగ్గుతో ఊగిపోయిన నవవధువు..వీడియో చూడాల్సిందే..
Wedding Day
Jyothi Gadda
|

Updated on: Aug 17, 2022 | 12:36 PM

Share

Viral Video: ప్రస్తుతం శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఎందుకంటే..ఇటీవల కాలంలో జరుగుతున్న వివాహ వేడుకలు విభిన్న స్టైల్లో జరుగుతున్నాయి. ప్రతి జంట తమ పెళ్లి రోజును జీవిత కాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం చేయగలిగిన అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో వధూవరుల కొత్త శైలులు, పెళ్లి ఊరేగింపులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన మరో వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఒక అమ్మాయి వధూవరులను కొన్ని ప్రశ్నలు అడగడానికి వేదికపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె వేసిన ఓ ప్రశ్నతో పెళ్లి కూతురు తెగ సిగ్గుపడిపోయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, వేదికపై ఉన్న వధూవరుల ముందు ఓ అమ్మాయి మైక్ తీసుకొచ్చి వారిని ప్రశ్నలు అడగడం కనిపిస్తుంది. ఆమె వరుడి ముందు వధువును,.. నువ్వు ఎప్పుడైనా మీ ఆయన ఫోన్‌ని చెక్‌ చేస్తావా..? అని అడిగింది..దాంతో వధువుకు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కష్టంగా మారుతుంది.ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.

ఇవి కూడా చదవండి

చివరికి ఈ ప్రశ్నకు వధువు ముఖం సిగ్గుతో ఎర్రబడటం,పెళ్లికి వచ్చిన అతిథులందరూ తెగ నవ్వుకోవటం కనిపిస్తుంది. వధువు తర్వాత అడ్డంగా తల ఊపుతూ.. మెల్లిగా నవ్వడం ప్రారంభిస్తుంది. ఈ వీడియో witty_wedding పేరుతో Instagram ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. వీడియో చూసిన నెటిజన్లు తమ స్టైల్లో కామెంట్స్‌ పెడుతున్నారు.