Chocolate Bars: ఆ గోడౌన్‌ని టార్గెట్ చేసిన దొంగలు..! రూ.17లక్షల విలువైన కాస్ట్‌లీ చాక్లెట్స్ చోరీ..
వ్యాపారి లేని సమయంలో భారీ ట్రక్కుతో సహా వచ్చిన దొంగలు గోడౌన్‌లో ఉంచిన దాదాపు 150 కాటన్ల చాక్టెట్స్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన చాక్లెట్స్ విలువ సుమారు రూ.17 లక్షలుగా తెలిసింది.
Chocolate Bars: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ వింత దొంగతనం వెలుగు చూసింది. ఇక్కడ ఇంట్లో ఏర్పాటు చేసిన గోదామును దొంగలు టార్గెట్ చేశారు. వ్యాపారి లేని సమయంలో భారీ ట్రక్కుతో సహా వచ్చిన దొంగలు గోడౌన్‌లో ఉంచిన దాదాపు 150 కాటన్ల చాక్టెట్స్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన చాక్లెట్స్ విలువ సుమారు రూ.17 లక్షలుగా తెలిసింది. ఆధారాలు మిగలకుండా ఉండేందుకు సీసీటీవీ డీవీఆర్‌ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని సదరు వ్యాపారి పోలీసులకు సమాచారం అందించాడు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
లక్నోలోని చిన్‌హట్‌లోని దేవ్‌రాజీ విహార్ ప్రాంతంలో జరిగింది ఈ దొంగతనం. చిన్‌హాట్‌లో తనకు ఇల్లు కూడా ఉందని వ్యాపారి రాజేంద్ర సింగ్ సిద్ధూ చెప్పారు. రెండు నెలల క్రితం వరకు కుటుంబంతో కలిసి ఈ ఇంట్లోనే ఉండేవాడు. ప్రస్తుతం మరో ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఇంటిలోపల తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెయిన్ గేట్ మూసే ఉంది. కానీ లోపల తలుపులు తెరిచి ఉన్నాయి.
లోపలికి వెళ్లి చూడగా, వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మెయిన్ గేట్ తాళం పగులగొట్టేందుకు దొంగలు ప్రయత్నించారు. కానీ తాళం పగలకపోయే సరికి సరిహద్దు గోడ దూకి లోపలికి వచ్చినట్టుగా భావించారు. చాక్లెట్లు చోరీ చేసేందుకు దొంగలు వాహనంతో సహా వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. గోడౌన్‌లో ఉంచిన 150 కాటన్ల చాక్లెట్స్ మాయమయ్యాయి. ఖరీదైన సుమారు రూ.17 లక్షల విలువైన చాక్లెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. అంతే కాకుండా ఇంట్లో ఉంచిన విలువైన వస్తువులు కూడా చోరీకి గురైనట్టు వ్యాపారి రాజేంద్ర సింగ్ సిద్ధూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో వ్యాపారి సీసీటీవీని పరిశీలించగా.. దొంగలు డీవీఆర్‌ను కూడా తొలగించి వెంట తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వ్యాపారి పోలీసులకు సమాచారం అందించాడు. చుట్టుపక్కల వారిని పోలీసులు విచారించగా.. ఓ ట్రక్కు రాత్రి చాలా సేపు రోడ్డుపక్కన నిలబడి ఉన్నట్టు తెలిసింది. ఆ వాహనంలోనే దొంగలు సరుకును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వెహికిల్ నెంబర్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి