Vitamin E: అందానికి, ఆరోగ్యానికి ఇది భాండాగారం.. ఈ ఒక్క విటమిన్‌తో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

విటమిన్లలో అతి ముఖ్యమైనది విటమిన్‌ 'ఇ'గా చెప్పొచ్చు. ఎందుకంటే..ఇది ఆరోగ్యానికి, సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్‌ అంటుంటారు నిపుణులు. విటమిన్‌ ఇ హానికరమైన

Vitamin E: అందానికి, ఆరోగ్యానికి ఇది భాండాగారం.. ఈ ఒక్క విటమిన్‌తో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
Vegetables
Jyothi Gadda

|

Aug 17, 2022 | 8:55 AM

Vitamin E capsules : మన శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైనది. శరీరానికి కావల్సిన విటమిన్లలో ఏ ఒక్క విటమిన్ లోపించినా అది పలు రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. విటమిన్లలో అతి ముఖ్యమైనది విటమిన్‌ ‘ఇ’గా చెప్పొచ్చు. ఎందుకంటే..ఇది ఆరోగ్యానికి, సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్‌ అంటుంటారు నిపుణులు. విటమిన్‌ ఇ హానికరమైన ఫ్రీరాడికల్ అణువును తొలగించడానికి మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ ఇ లో అధికంగా ఉంటాయి. చర్మసౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుంది విటమిన్‌ ఇ. ‘విటమిన్ ఇ’ వల్ల కలిగే ప్రయోజనాలు, విటమిన్ ఇ లోపం వల్ల కలిగే నష్టాలు ఎంటో ఇక్కడ తెలుసుకుందాం..

విటమిన్‌ E లాభనష్టాలు.. విటమిన్‌ ఇ.. కొవ్వును కరిగించే విటమిన్‌, ఇది శక్తివంతమైన అనామ్మజని. అనామ్లజని గనుక ఇది మీ చర్మాన్ని హానికారకల నుండి రక్షిస్తుంది. ఇది అనేక ఆహార ఉత్పత్తులతో సహజంగా లభిస్తుంది. శరీరంలో జీవక్రియ సక్రంమగా జరగడానికి ఇ విటమిన్ దోహదపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ ఇ ఆహారాలు అధికంగా తీసుకోవాలి. జన్యు పదార్థాల తయారీలో అంటే.. స్వభావాలు, పోలికలు ఒక తరం నుండి మరో తరానికి చేరడానికి విటమిన్ ఇ దోహదం చేస్తుంది.

గోర్ల ఆరోగ్యం గోర్ల ఆరోగ్యం, పెరుగుదలలో విటమిన్‌ ఇ కీలకం. గోర్లు పసుపు రంగులోకి మారటం. తరచూ విరిగిపోవటాన్ని నివారించడానికి విటమిన్‌ ఇ అవసరం. మీ గోర్లు, క్యూటికల్స్, గోళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయడానికి capsuleలోని నూనెను ఉపయోగిస్తే మంచిది.

జుట్టు పెరుగుదలకు జుట్టు పెరుగుదలకు విటమిన్ ఇ ఆయిల్ అద్భుతమైన నూనెగా పనిచేస్తుంది. క్యాప్సూల్ నుండి నూనెను బయటకు తీసి, మీ రెగ్యులర్ హెయిర్ ఆయిల్‌తో కలపండి. దీన్ని మీ జుట్టుకు సున్నితంగా మసాజ్ చేసి 2-3 గంటల పాటు అలాగే ఉంచిన తరువాత కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే ఫలితం ఉంటుంది.

ఓవర్ నైట్ క్రీమ్ మాయిశ్చరైజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన విటమిన్ ఇ క్యాప్సూల్స్ Overnight creamగా బాగా పని చేస్తాయి. మీరు మీ రెగ్యులర్ నైట్ క్రీమ్‌లో కొన్ని చుక్కల విటమిన్ ఇ ఆయిల్‌ని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఇది సీరంలా పనిచేసి రాత్రి సమయంలో మీ ముఖానికి తగినంత తేమను అందిస్తుంది.

యాంటీ రింకిల్ క్రీమ్ చర్మంపై ముడతలు, గీతలు ఉన్నవారికి విటమిన్ ఇ నూనెను యాంటీ ఏజింగ్ క్రీమ్‌గా ఉపయోగించవచ్చు. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. విటమిన్ ఇ నూనెను చర్మంపై మసాజ్ చేయడం వల్ల చర్మ నిర్మాణాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ చర్మం దృఢంగా, మెరుస్తూ ఉంటుంది.

కంటిలో ఏర్పడే శుక్లాలతో పాటు, కంటికి వచ్చే మాక్యూలార్ డీజనరేషన్ అనే వ్యాధిని ఈ విటమిన్ ఇ చాలా వరకూ నివారిస్తుంది. చూపు స్పష్టతకు తోడ్పడుతుంది. విటమిన్ ఇలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తాయి. క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. మధుమేహ నివారణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు విటమిన్ ఇ ఉన్న పోషకాలను తీసుకుంటే అధిక బరువును నియంత్రించవచ్చు. విటమిన్ ఇ కండరాలను దృఢంగా ఉంచి, అవి తేలికగా కదలడానికి తోడ్పడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu