AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana rape case: ఆగని దారుణాలు.. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..హత్య.. పోస్టుమార్టం నివేదికలో క్రూరమైన నిజాలు..!

సీసీ ఫుటేజ్‌ దృశ్యాల ఆధారంగా నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అత్యాచారం అనంతరం చిన్నారిని

Haryana rape case: ఆగని దారుణాలు.. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..హత్య.. పోస్టుమార్టం నివేదికలో క్రూరమైన నిజాలు..!
Gangrape
Jyothi Gadda
| Edited By: |

Updated on: Aug 17, 2022 | 3:44 PM

Share

Haryana rape case: అన్నెంపున్నెం ఎరుగని అమాయకబాల లపై అఘాయిత్యాలు ఆగటం లేదు..ముక్కుపచ్చలరాని చిన్నారులను అతి క్రూరంగా చిదిమేస్తున్నారు మానవ మృగాలు..ఎన్ని చట్టాలు, ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ కామాంధులకు కళ్లు తెరుచుకోవటం లేదు.. మరో ఆరేళ్ల బాలికను అతి కిరాతంగా అత్యాచారం చేసిన హతమార్చారు దుండగులు. దేశమంతటా 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవాల వేడుకలు జరుగుతుండగా, మరోవైపు ఆరేళ్ల చిన్నారిని చెరబట్టాడో కామాంధుడు.. ఈ ఘటన హర్యానాలోని పానిపట్‌ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. హర్యానాలోని పానిపట్ ప్రాంతంలోని డ్రెయిన్ సమీపంలోని నిర్జనప్రదేశంలో ఆరేళ్ల బాలిక మృతదేహం లభించింది. 40 ఏళ్ల వలస కూలీని బాలికను అపహరించి, అత్యాచారం చేసి, హత్య చేసినట్టుగా గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఈశ్వర్‌సింగ్‌ ఉత్తరాఖండ్‌లోని చమోలీకి చెందినవాడని, పానిపట్‌లోని దాబాలో పని చేస్తూ 15 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ సంఘటన ఆగస్టు 15న చోటు చేసుకుంది. ఆ రోజు సాయంత్రం 6 ఏళ్ల బాలిక, తనకంటే రెండేళ్లు చిన్నవాడైన తన తమ్ముడితో కలిసి పానిపట్‌లోని తమ ఇంటికి సమీపంలోని పార్కులో ఆడుకుంటుంది. అప్పుడే చిన్నారిపై కన్నేసిన కామాంధుడు..పార్కులో ఆడుకుంటున్న బాలికకు బిస్కెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు.. సెక్టార్ 25లోని నిర్మానుష్య ప్రదేశంలో బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బాలిక గొంతుకోసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడని వెల్లడించారు.

బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సమీపంలోని ఫ్యాక్టరీల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిందితులు చిన్నారిని తీసుకెళ్లినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్‌ దృశ్యాల ఆధారంగా నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అత్యాచారం అనంతరం చిన్నారిని గొంతుకోసి హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది.అదే రోజు సాయంత్రం పానిపట్‌లోని సెక్టార్ 25లోని జింఖానా క్లబ్ సమీపంలో నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.కస్టడీకి అప్పగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి