Maharashtra’s Gondia: ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టిన గూడ్స్‌ రైలు.. పట్టాలు తప్పిన మూడు బోగీలు

గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలు ఢీకొనడం సిగ్నలింగ్ సమస్యల కారణంగానే ప్రమాదం జరిగిందని తెలిసింది. డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే గూడ్స్‌ రైలు ప్యాసింజర్‌ రైలును ఢీకొనడంతో..

Maharashtra’s Gondia: ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టిన గూడ్స్‌ రైలు.. పట్టాలు తప్పిన మూడు బోగీలు
Maharashtra's Gondia
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:44 PM

Maharashtra’s Gondia: మహారాష్ట్రలోని గోండియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజర్‌ రైలు, గూడ్స్‌ రైలు ఢీ కొన్నాయి. దీంతో ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. రైలు 3 బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. గాయపడిన 50 మందిలో 49 మంది ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ కాగా, ఒకరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణానష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన రైలు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుండి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు వెళుతోంది.

గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలు ఢీకొనడం సిగ్నలింగ్ సమస్యల కారణంగానే ప్రమాదం జరిగిందని తెలిసింది. డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే గూడ్స్‌ రైలు ప్యాసింజర్‌ రైలును ఢీకొనడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి