West bengal: మురుగునీటిలో తేలుతూ కనిపించిన బాక్సులు.. లోపల ఏముందా అని చెక్ చేసి స్థానికులు షాక్
ఆ ప్రాంతంలోని చెత్తలో ఉండే ప్లాస్టిక్ వస్తువులు, పేపర్ అట్టలు వంటివి వారు సేకరించి.. వాటిని స్క్రాప్ సెంటర్ల వద్ద అమ్మి వారు జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ పని నిమిత్తం వెళ్లిన వారికి డ్రైన్ వాటర్‌లో తేలుతూ 5 బాక్సులు కనిపించాయి.
Kolkata: కోల్‌కతాకు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హౌరా జిల్లా(Howrah district)లో దారుణ ఘటన వెలుగుచూసింది. మూడలగి బస్టాండ్(Moodalagi bus stand) సమీపంలోని డ్రెయిన్‌లో ఏవో బాక్సులు తేలడాన్ని గమనించారు చెత్త ఏరుకునే వ్యక్తులు. అందులో ఏముందని ఓపెన్ చేయగా లోపల పసికందు పిండాలు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు, జిల్లా పౌర ఆరోగ్య శాఖ అధికారులు మొత్తం 5 బాక్సుల్లోని 18 పిండాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పిండాలు కనిపించిన డంపింగ్ గ్రౌండ్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 30 ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. “ఇది తీవ్రమైన విషయం. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏదైనా ఆసుపత్రిలో లేదా నర్సింగ్‌హోమ్‌లో మెడికల్ రాకెట్ నడుస్తోందా అనేది తేలాల్సి ఉంది” అని హౌరా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నితైచంద్ర మొండోల్ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని పిండాల వయస్సు 5 నెలల లోపే ఉంటుందని తేలింది. లింగ నిర్ధారణ అనంతరం.. ఆడ శిశుల హత్యలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోతైన దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి