Chennai: వేడివేడిగా పూరి ఆర్డర్ ఇచ్చిన కస్టమర్.. హోటల్ వాళ్లు సర్వ్ చేసింది చూసి కడుపులో వికారం

మీరు రెస్టారెంట్‌కి, హోటల్‌కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారా..? వేడిగా వచ్చింది కదా అని ఆవురావురుమంటూ తినేయకండి. ఆరగించే ముందు అరక్షణం దాన్ని చెక్ చేయండి.

Chennai: వేడివేడిగా పూరి ఆర్డర్ ఇచ్చిన కస్టమర్.. హోటల్ వాళ్లు సర్వ్ చేసింది చూసి కడుపులో వికారం
Puri Representative image
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:44 PM

Tamil Nadu: టిఫిన్ తిందామని పూరీ ఆర్డరిస్తే… అందులో పురుగులొచ్చాయ్.. ఓ కస్టమర్ ఇచ్చిన కంప్లయింట్‌తో ఒకటీ, రెండు కాదు, కస్టమర్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నాలుగు రెస్టారెంట్లు మూతపడ్డాయి. చెన్నైలోని ఓ మాల్‌లో కొందరు రెస్టారెంట్‌కు వెళ్లారు. పూరీ ఆర్డర్‌ ఇచ్చారు. అయితే.. అందులో పురుగులు కనిపించాయి. ఇదేంటని రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. అటునుంచి సమాధానం రాలేదు. దీంతో కస్టమర్లకు కోపం వచ్చింది. అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు.. పూరీ పిండిని చెక్‌ చేశారు. పూరీ పిండిలోని పురుగులు ఉండటం చూసి అధికారులు కంగుతిన్నారు. వాటిలో కొన్ని బతికే ఉన్నాయి. మరికొన్ని చచ్చిపోయి పూరీలో కలిసిపోయాయి. మరీ ఇంత దారుణంగా పూరీలు చేస్తున్నారా అంటూ ఆ రెస్టారెంట్‌ని సీజ్‌ చేశారు అధికారులు. కథ ఇంతటితో ఆగలేదు. ఒక రెస్టారెంట్‌నే కాదు.. ఆ మాల్‌లో ఉన్న మిగతా రెస్టారెంట్లలోనూ తనిఖీలు చేశారు. ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం. అన్ని చోట్ల పురుగుల పూరీ పిండే కనిపించింది. పది రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తే.. నాలుగింటిలో వరస్ట్‌ ఫుడ్ కనిపించింది. కుళ్లిన మాంసం, పాడైపోయిన భోజనం దొరకడంతో నాలుగు రెస్టారెంట్లను సీజ్ చేశారు. వాటి యజమానులకు నోటీసులు జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి