AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రేమంటే ఇదేరా.. ఈ రెండు పులుల లవ్ చూస్తే మీకు జలసీ వచ్చేస్తుంది.. వీడియో వైరల్..

ఈ అద్భుత దృశ్యం ఓ జూలో కనిపించింది. ఇదంతా వీడియో తీసిన సిబ్బంది సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియో వేల మంది నెటిజన్ల మనసుల్లో చోటు సంపాదించుకుంది.

Viral Video: ప్రేమంటే ఇదేరా..  ఈ రెండు పులుల లవ్ చూస్తే మీకు జలసీ వచ్చేస్తుంది.. వీడియో వైరల్..
Tigers
Jyothi Gadda
|

Updated on: Aug 17, 2022 | 12:13 PM

Share

Viral Video: ప్రజలు సోషల్ మీడియా వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒత్తిడి, టెన్షన్‌ను తగ్గించుకోవడానికి ప్రజలు ఎక్కువగా వైరల్‌ వీడియోలు చూస్తుంటారు. వీటిలో జోకులు, జంతువుల వీడియోలు, వివాహ వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి.. వివాహవేడుకల్లో ఆనందం, డ్యాన్స్‌లు, ఉల్లాసానికి సంబంధించిన పెళ్లి వీడియోలు ఎక్కువగా నెటిజన్ల ఆసక్తిని పెంచుతుంటాయి. జంతువులపై ఉన్న ప్రేమ జంతు వీడియోలపై ఆసక్తిని పెంచుతోంది. స్వతహాగా ప్రజలు అడవి జంతువుల వీడియోలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే, తాజాగా ఓ తెల్ల పులి,మరో పులి మధ్య సాగుతున్న ప్రేమకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పులులు అత్యంత తెలివైన మాంసాహారులు. ఆరోగ్యవంతమైన మగ పులి కనీసం 200 కిలోల బరువు ఉంటుంది. ఆడ పులుల గరిష్ట బరువు 180 కిలోలు. ఇవి ఐదు మీటర్ల ఎత్తు వరకు దూకగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పులుల గరిష్ట గర్భధారణ కాలం 110 రోజులు. ఒక కాన్పులో నాలుగు పిల్లలు వరకు పెడుతుంటాయి. ఇప్పుడు పులి, తెల్ల పులి మధ్య ప్రేమకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

ఇది హో సోక్లిన్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన వీడియో. వీడియోలో రెండు పులులు ఒకదానితో ఒకటి ప్రేమగా మసలుకోవటం చూడవచ్చు. కాసేపు ఆగ్రహంతో గర్జించినా, అంతలోనే ప్రేమను పంచుకుంటున్నాయి. ఒకదాని ముందు మరొకటి గారాబం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే,ఈ అద్భుత దృశ్యం ఓ జూలో కనిపించింది. ఇదంతా వీడియో తీసిన సిబ్బంది సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియో వేల మంది నెటిజన్ల మనసుల్లో చోటు సంపాదించుకుంది. లైకులు, షేర్లు చేస్తూ వీడియోను మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి