Viral News: లలితా జ్యూవెల్లరి ఎండీ గుండు వెనకాల అసలు కథ అదేనంటా.. సీక్రెట్‌ను బయటపెట్టిన కిరణ్‌..

Viral News: 'డబ్బులు ఊరికే రావు' అంటూ తెలుగు వారి ఇళ్లల్లో నిత్యం ఒక యాడ్‌ వస్తూనే ఉంటుంది. ఈ డైలాగ్‌ చెప్పగానే ప్రతీ ఒక్కరికీ అది లలితా జ్యూవెల్లరి యాడ్‌ అనే విషయం ఇట్టే అర్థమైపోతుంది...

Viral News: లలితా జ్యూవెల్లరి ఎండీ గుండు వెనకాల అసలు కథ అదేనంటా.. సీక్రెట్‌ను బయటపెట్టిన కిరణ్‌..
Lalitha Jewellery Md Kiran
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:38 PM

Viral News: ‘డబ్బులు ఊరికే రావు’ అంటూ తెలుగు వారి ఇళ్లల్లో నిత్యం ఒక యాడ్‌ వస్తూనే ఉంటుంది. ఈ డైలాగ్‌ చెప్పగానే ప్రతీ ఒక్కరికీ అది లలితా జ్యూవెల్లరి యాడ్‌ అనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఆ యాడ్‌ అంతలా పాపులర్‌ అయ్యింది. సాధారణంగా సంస్థలు స్టార్‌ హీరోలను తమ సంస్థ ప్రమోషన్‌కు ఉపయోగించుకుంటారు. అయితే లలితా జ్యూవెల్లరి ఎండీ కిరణ్‌ కుమార్‌ మాత్రం తన సంస్థకు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయారు. ఓ సెలబ్రిటీల మారిపోయారు.

ఇక నిత్యం గుండుతో కనిపంచడం అతని స్టైల్‌. ఇంతకీ కిరణ ఎందుకలా నిత్యం గుండుతో కనిపిస్తాడు.? అసలు దాని వెనకాల ఉన్న రీజన్‌ ఏంటనే దానిపై చాలా మందిలో సందేహం ఉండే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. మీరు ఎప్పుడూ గుండుతోనే కనిపించడానికి కారణం ఏంటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘నిజానికి నాకు చాలా ఒత్తైన జట్టు ఉండేది. కానీ కొందరు నన్ను ఇలా మార్చేశారు. ఓసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు తలనీలాలు సమర్పించాను. ఆ సమయంలో పక్కన ఉన్న వారు నేను గుండులో బాగున్నానని కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి గుండులోనే ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలసుకున్న నెటిజన్లు లలితా జ్యూవెల్లరి ఎండీ గుండు వెనకాల అసలు కథ ఇదా అని అనుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..