ఒకే ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతి..! అసలేం జరిగింది..?
మృతుల్లో సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్ ఉల్ హబీబ్, సాజిద్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, వీరు ఎలా చనిపోయారన్న విషయంపై
ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు కనిపించటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం ఆ ప్రాంతంలో మరింత ఆందోళన, చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణ ఘటన జమ్మూ కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో బుధవారం ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఆరుగురు తమ నివాసంలోనే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహలు పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. అనంతరం, వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
J&K | Six members of a family found dead at their residences in Sidra area of Jammu. Details awaited.
కాగా, మృతుల్లో సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్ ఉల్ హబీబ్, సాజిద్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, వీరు ఎలా చనిపోయారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు.