AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scorpion Venom: తేలు విషానికి భారీ డిమాండ్.. లీటరు రూ. 80 కోట్లు.. ఆ దేశంలో ప్రత్యేక ల్యాబ్స్ లో తేళ్ల పెంపకం

తేళ్ల విషంతో మందులు తయారు చేస్తారు. శరీరానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి తేలు విషానికి ఉంది. అందుకనే తేలు విషానికి అత్యంత డిమాండ్.

Scorpion Venom: తేలు విషానికి భారీ డిమాండ్.. లీటరు రూ. 80 కోట్లు.. ఆ దేశంలో ప్రత్యేక ల్యాబ్స్ లో తేళ్ల పెంపకం
Scorpion Venom
Surya Kala
|

Updated on: Aug 19, 2022 | 9:45 AM

Share

Scorpion Venom: విషపు జంతువుల్లో ఒకటి తేలు.ఇవి 2000 జాతులున్నాయి. తేలు కుడితే సర్వ సాధారణంగా ప్రాణం పోదు .. అయితే విపరీతమైన బాధపడతారు.   ఎటువంటి వాతవరణంలోనైనా జీవించే తేలు.. ఏడాదికి ఒకసారి తిన్నా జీవిస్తాయి. తినడానికి ఆహారం దొరక్క పొతే జీర్ణప్రక్రియ వేగాన్ని తగ్గించుకుంటాయి. విచిత్రమైన ఆకారమే కాదు.. జీవన విధానం కూడా విచిత్రంగా ఉంటుంది. అయితే ఈ తేళ్లు విషం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషం.

తేళ్ల విషంతో మందులు తయారు చేస్తారు. శరీరానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి తేలు విషానికి ఉంది. అందుకనే తేలు విషానికి అత్యంత డిమాండ్. ప్రస్తుతం ఒక గ్రాము తేలు విషం 80వేల వరకు విక్రయిస్తారు. అంటే లీటర్ తేలు విషం ధర లీటర్ రూ. 80కోట్లు వరకు పలుకుతుంది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషంగా గుర్తింపుని సొంతం చేసుకుంది. దీంతో టర్కీ దేశంలో తేళ్లను ల్యాబ్స్ లో పెట్టి మరీ పెంచుతున్నారు.

టర్కీలోని ఒక ల్యాబ్ లో రోజుకు తేళ్ల నుంచి 2 గ్రాముల విషాన్ని సేకరిస్తున్నారు. తేళ్లను బాక్సుల నుండి బయటకు తీసి ప్రత్యేక పద్ధతుల్లో వాటి నుండి విషాన్ని సేకరిస్తారు. తర్వాత విషాన్ని గడ్డకట్టించి పొడి చేసి విక్రయిస్తారు. తేళ్లను పెంచుతున్న యజమాని మెటిన్ ఓరిన్లర్ మీడియాతో  మాట్లాడుతూ..తేళ్ల నుంచి విషాన్ని సేకరించే విధానం గురించి వివరించాడు.

ఇవి కూడా చదవండి

“తాము తేళ్లను పెంచుతున్నామని.. వారి నుంచి విషాన్ని కూడా సేకరిస్తున్నామని చెప్పాడు. అలా తేళ్ళనుంచి సేకరించిన విషాన్ని ముందుగా  గడ్డకట్టిస్తామని చెప్పారు. గడ్డకట్టిన విషాన్ని పౌడర్‌గా మార్చి విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ ‘ తేలు విషాన్ని యాంటీబయాటిక్స్, కాస్మోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఒక తేలులో 2 మిల్లీగ్రాముల విషం ఉంటుంది. “సాధారణంగా మేము 300-400 తేళ్ల నుండి ఒక గ్రాము విషాన్ని సేకరిస్తామని” అని మెటిన్ చెప్పారు.

తేలు విషంలో కాంపొనెంట్స్ ఉంటాయి. దీంతో కీళ్లవాతాన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తెలిసింది. వృద్ధాప్యంలో వచ్చే కీళ్లవాతం(రుమటాయిడ్ ఆర్థరైటిస్), కీళ్ల నొప్పుల వంటివి తగ్గుతాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!