Viral: మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి బయటికి తీయగా కళ్లు జిగేల్.!
పురావస్తు తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో ఓ మెరిసే వస్తువు కనిపించింది. అది ఏమై ఉంటుందా అనుకుని..
పురావస్తు తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో ఓ మెరిసే వస్తువు కనిపించింది. అది ఏమై ఉంటుందా అనుకుని.. అధికారులు దాని చుట్టూ ఉన్న మట్టిని తవ్వి.. బయటికి తీశారు. అంతే! ఒక్కసారిగా వారి కళ్లు జిగేలుమన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తూత్తుకుడి జిల్లాలోని శివగలై ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఇటీవల వారికి తవ్వకాలు జరుపుతుండగా ఓ బంగారం ముక్క లభ్యమైంది. ఆ ముక్క లాకెట్టు లేదా చెవిపోగుకు సంబంధించినదై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 0.03 గ్రాముల బరువు ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా 34 పురాతన వస్తువులను అధికారులు కనిపెట్టినట్లు సమాచారం. అందులో అరుదైన కలశం కూడా ఉందట. ఆ కలశంతో పాటు రెండు పొడవాటి పెళుసుగా ఉండే ఎముకలు, రెండు నైవేద్య పాత్రలు, ఒక మూత, రెండు గిన్నెలు, కుండలు కూడా దొరికాయట. కాగా, పురావస్తు తవ్వకాల్లో దొరికిన అరుదైన వస్తువులను సెప్టెంబర్‌లో రెండు విడతలగా ప్రదర్శనలో ఉంచుతారట.
మరిన్ని జాతీయ వార్తల కోసం..