Crime: నకిలీ పోలీసులు కాదండోయ్.. ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ నే నడిపించేశారు.. స్టన్న్ అయ్యే షాకింగ్ ఎలిమెంట్స్
మనం ఇప్పటివరకు ఎన్నో విచిత్రమైన వార్తలు చదివాం. ఘటనల గురించి విన్నాం. కొంత మంది నకిలీ పోలీసులుగా (Fake Police) నటిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే ఘటనల గురించి మనకు తెలిసిందే. అమాయక ప్రజల నుంచి ముఠా సభ్యులు..
మనం ఇప్పటివరకు ఎన్నో విచిత్రమైన వార్తలు చదివాం. ఘటనల గురించి విన్నాం. కొంత మంది నకిలీ పోలీసులుగా (Fake Police) నటిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే ఘటనల గురించి మనకు తెలిసిందే. అమాయక ప్రజల నుంచి ముఠా సభ్యులు డబ్బులు దోచుకుంటూ మోసగిస్తాయి. నకిలీ పోలీసుల సంగతి సరే..కానీ నకిలీ పోలీస్ స్టేషన్ గురించి మీరు విన్నారా.. లేకపోతే వెంటనే ఈ వార్త చదివేయండి. బిహార్ లో జరిగిన ఈ విచిత్ర ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. బిహార్‌లోని (Bihar) బాంకాలో ఎనిమిది నెలల పాటు నకిలీ పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు నిర్వహించడం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదీ.. పట్టణ పోలీస్ స్టేషన్ కు, స్థానిక ఎస్పీ నివాసానికి కూతవేటు దూరంలో కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గెస్ట్‌హౌస్‌లో కొందరు పోలీసుల యూనిఫాం ధరించి అసలైన పోలీసులలాగా కలరింగ్ ఇచ్చారు. వీరి మాటలు నమ్మి వారి వద్దకు వచ్చిన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం.
నకిలీ పోలీసులుగా చెలామణీ అవుతున్న సభ్యుల్లో ఇద్దరి వద్ద సర్వీస్ రివాల్వర్‌కు బదులుగా దేశీయ తుపాకులు ఉండటంతో పట్టణ పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారుర. ముఠా సభ్యులు ఎస్సై, డీఎస్పీ బ్యాడ్జీలు ఉన్న యూనిఫాంలు ధరించేవారు. నిజమైన తుపాకులనూ వెంట పెట్టుకు తిరిగేవారుర. పలు వ్యవహారాల్లో స్టేషన్‌ను ఆశ్రయించే స్థానికుల నుంచి డబ్బు వసూలు చేశారు. అంతే కాకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కల్పిస్తామని, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీగా మోసాలకు తెర లేపారు. ఇలా ఇద్దరిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి