AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంపెనీలకు షాకిస్తున్న ఉద్యోగులు! వచ్చే12 నెలల్లో కొత్త ఉద్యోగాలకు భారీగా వలసలు..

కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా కంపెనీల ధృక్పధంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. యజమానులు, ఉద్యోగుల మైండ్‌సెట్‌లో చోటుచేసుకున్న మార్పులే అందుకు ప్రధాన కారణమని సర్వే..

కంపెనీలకు షాకిస్తున్న ఉద్యోగులు! వచ్చే12 నెలల్లో కొత్త ఉద్యోగాలకు భారీగా వలసలు..
Workforce Strategy
Srilakshmi C
|

Updated on: Aug 18, 2022 | 8:25 PM

Share

32% of Indian employees want to change their current jobs: కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా కంపెనీల ధృక్పధంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. యజమానులు, ఉద్యోగుల మైండ్‌సెట్‌లో చోటుచేసుకున్న మార్పులే అందుకు ప్రధాన కారణమని సర్వే రిపోర్టులు తెల్పుతున్నాయి. ఫలితంగా రానున్న 12 నెలల్లో 34 శాతం మంది ఉద్యోగులు తమ యజమానులను మార్చి, కొత్త ఉద్యోగాలకు తరలిపోయే అవకాశం ఉందని పీడబ్ల్యూసీ ఇండియా సర్వే నివేధిక వెల్లడించింది. ఐతే Gen Z ఉద్యోగులు నిష్క్రమించే అవకాశం తక్కువగా ఉందని, వారిలో దాదాపు మూడింట ఒక వంతు మంది మాత్రం వర్కింగ్ అవర్స్‌ తగ్గించమని అడిగే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. తాజా సర్వే ప్రకారం..

దేశంలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న మొత్తం ఎంప్లాయిస్‌లలో 32 శాతం మంది కొత్త ఉద్యోగాలకు మారాలనే యోచనలో ఉండగా, 71 శాతం మంది కెరీర్ గ్రోత్‌ గురించి అంతగా పట్టింపులేదని భావిస్తున్నారు. ఇక అటు యజమానులైతే స్థితిస్థాపకమైన వర్క్‌ఫోర్స్ వ్యూహాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టినప్పటికీ.. రివార్డులతో పాటు సృజనాత్మకత, ఇన్నోవేషన్‌, ప్రామాణికత వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు పీడబ్ల్యూసీకి చెందిన ఇండియా వర్క్‌ఫోర్స్ హోప్స్ అండ్ ఫియర్స్ సర్వే 2022 తెలిపింది. ఈ సర్వే ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 19 శాతం మందితో పోలిస్తే మన దేశంలో 34 శాతానికి పైగా ఉద్యోగులు కొత్త ఉద్యోగాలకు మారాలని భావిస్తున్నారు. ఈ సర్వేలో మన దేశ ఉద్యోగులు 2,608 మంది పాల్గొనగా.. వారిలో 93% మంది ఫుల్‌ టైం ఉద్యోగులు కావడం విశేషం. ‘కంపెనీ భవిష్యత్తుకు ఉద్యోగి దృక్పథం తప్పనిసరిగా యాజమాన్యం దృక్పథానికి అనుగుణంగా ఉండాలి. ఈ రెండు అంశాల మధ్య అంతరాన్ని తొలగించి, సమన్వయం సాధించడానికి స్పష్టమైన కార్యచరణ రూపొందించడం అవసరమని’ పీడబ్ల్యూసీ ఇండియా పీపుల్ అండ్ ఆర్గనైజేషన్ పార్టనర్, లీడర్ చైతాలీ ముఖర్జీ సూచిస్తున్నారు.