Gold Price: బంగారం ప్రియులకు కలిసొచ్చే అంశం.. స్థిరంగా గోల్డ్ రేట్స్.. మరింత తగ్గిన వెండి ధర..
Gold And Silver Price: బంగారరం ధరలు వినియోగదారులకు ఊరటకలిగిస్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగాయి. రెండు రోజుల్లో తులం బంగారంపై రూ. 280 తగ్గగా ఈ రోజు ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు...
Gold And Silver Price: బంగారరం ధరలు వినియోగదారులకు ఊరటకలిగిస్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగాయి. రెండు రోజుల్లో తులం బంగారంపై రూ. 280 తగ్గగా ఈ రోజు ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక ఆగస్టు 13వ తేదీ నుంచి బంగారం ధరలో పెరుగుదల కనిపించలేదు. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,250 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయన్న దానిపై ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 48,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,400 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేట్ రూ. 47,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,250 గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 52,310 వద్ద కొసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం బంగారం ధర తగ్గడం విశేషం. తులం గోల్డ్‌పై రూ. 130 తగ్గింది. చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,380 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52చ700 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో శుక్రవారం 22 క్యారెట్ల తులం గోల్డ్ రేట్ రూ. 47,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,250 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,250 గా ఉంది.
* సాగరతీరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,250 వద్ద కొసాగుతోంది.
వెండి ధర ఎలా ఉందంటే..
బంగారం ధర స్థిరంగా కొనసాగుతున్న వేళ వెండి ధర మాత్రం భారీగా పతనమవుతోంది. గడిచిన మూడు రోజులుగా సిల్వర్ రేట్ తగ్గుతూనే ఉంది. మూడు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ. 2400 తగ్గడం విశేషం. ఈ రోజు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందంటే.. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 56,700 కాగా, ముంబైలో కిలో వెండి ధర రూ. 56,700 , హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..