AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: నాడు వెండి తెరపై సన్నజాజి తీగ.. నేడు ముద్దుగుమ్మ.. హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

ఓ హీరోయిన్ ను చూసి అభిమానులు షాక్ తింటున్నారు. ఎందుకంటే.. వెండి తెరపై అందంగా సన్నజాజి తీగలా ఉండే ఆ బొమ్మ.. ఇప్పుడు ముద్దు, బొద్దుగా తయారు అయింది. ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. 

Viral Photo: నాడు వెండి తెరపై సన్నజాజి తీగ.. నేడు ముద్దుగుమ్మ.. హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
Rakshita Latest Photos
Surya Kala
|

Updated on: Aug 19, 2022 | 3:24 PM

Share

Viral Photo: సృష్టిలో ప్రతి జీవిలో వయసుతో పాటు సహజమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే కొంతమంది మాత్రం వయసుతో వచ్చే మార్పులను అంతగా అంగీకరించలేరు. దీంతో జుట్టుకు రంగు వేసుకుంటారు.. చర్మంలో ముడుతలు కనిపించకుండా రకరకాల క్రీములు రాస్తారు.. ఈ విషయంలో సామాన్యులతో పాటు సెలబ్రెటీల ఆలోచనా తీరుకూడా అదే విధంగా ఉంటుంది. అందుకనే చాలామంది నటీనటులు.. వయసు వచ్చిన తర్వాత తమ అందం తరిగిపోయిందంటూ అభిమానులకు కనిపించడానికి ఇష్టపడరు అని చెబుతుంటారు. అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా ఏర్పడిన మార్పులను అంగీకరించడమే కాదు.. ఇవన్నీ సహజమైనవి అంటూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. తాజాగా ఓ హీరోయిన్ ను చూసి అభిమానులు షాక్ తింటున్నారు. ఎందుకంటే.. వెండి తెరపై అందంగా సన్నజాజి తీగలా ఉండే ఆ బొమ్మ.. ఇప్పుడు ముద్దు, బొద్దుగా తయారు అయింది. ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

మాస్ మహారాజ రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇడియట్ సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచమైన కన్నడ సోయగం రక్షిత.. ఆమె తాజా లుక్ ని చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. ఎందుకంటే ఇడియట్ సినిమాలో రక్షిత అందం, అభినయంతో అలరించింది. పెళ్ళాం ఊరెళితే, నిజం, శివమణి, లక్ష్మీనరసింహ, ఆంధ్రావాలా వంటి అనేక సినిమాలో నటించింది. రక్షిత అసలు పేరు శ్వేతా.  పునీత్ రాజ్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అప్పు సినిమాతో కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే.. తెలుగులో ఇడియట్ సినిమాతో అడుగు పెట్టింది. శ్వేత రక్షితగా పేరు మార్చుకుంది.

Rakshita

Rakshita

2007 లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వరస సినిమాలతో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకున్న రక్షిత.. తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించింది. పలు టివి షోలకు జడ్జిగా వ్యవహరించింది. అనంతరం  రాజకీయాల్లో కూడా అడుగు పెట్టింది. అయితే రక్షితకు కొడుకు పుట్టిన తర్వాత విపరీతమైన ఒళ్ళు చేసింది. అసలు రక్షిత ఏనా అన్న చందంగా మారిపోయింది. తనకు డెలివరీ అయిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లెమ్ వచ్చిందని.. అందుకే తనకు విపరీరమైన శరీరం వచ్చిందని ఓ సందర్భంలో రక్షిత చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..