AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ethiopian Airlines: 37 వేల అడుగుల ఎత్తులో విమానంలో ఆదమరచి కునుకు తీసిన పైలెట్లు.. కట్ చేస్తే

ఎయిర్ పోర్ట్‌లో రన్‌వే పై విమానాన్ని భద్రంగా దించాల్సిన పైలట్లు కాక్ పిట్ లో హాయిగా నిద్రలోకి జారుకున్నారు. దీంతో ఆ విమానం దిగాల్సిన గమ్య స్థానం దాటి వెళ్ళిపోయింది.

Ethiopian Airlines: 37 వేల అడుగుల ఎత్తులో విమానంలో ఆదమరచి కునుకు తీసిన పైలెట్లు.. కట్ చేస్తే
Ethiopian Airlines
Follow us
Surya Kala

|

Updated on: Aug 20, 2022 | 9:24 AM

Ethiopian Airlines: బస్సు, రైలు, విమానం ఏ రవాణాసాధనాల్లో ప్రయాణం చేసినా సరే.. ప్రయాణీకులను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేరవేయడానికి ప్రాముఖ్యత నిస్తాయి సదరు సంస్థలు. అందుకనే ప్రతి క్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తారు.. వారిని డ్రైవ్ చేసేవారు. విమానాన్ని నడిపే పైలట్లు గాలిలోకి విమానం చేరుకున్నది మొదలు.. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యి.. ప్రయాణీకులను భద్రంగా దించేవరకూ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఎయిర్ పోర్ట్‌లో రన్‌వే పై విమానాన్ని భద్రంగా దించాల్సిన పైలట్లు కాక్ పిట్ లో హాయిగా నిద్రలోకి జారుకున్నారు. దీంతో ఆ విమానం దిగాల్సిన గమ్య స్థానం దాటి వెళ్ళిపోయింది. కొద్దీ సేపటికి విమానంలోని అలారం మ్రోగడంతో మెలకువ వచ్చి.. తిరిగి విమానాన్ని ఎయిర్ పోర్ట్ లో దింపారు. దీంతో ప్రయాణీకులు హమ్మయ్య అనుకున్నారు. ఈ వింత సంఘటన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణీకులకు ఓ పీడకలను మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే..

ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్దదైన ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 ఈటీ343 విమానం సోమవారం (ఆగష్టు 15వ తేదీన) సూడాన్‌ నుంచి ఇథియోపియాకు బయలుదేరింది. .37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం అడీస్‌ అబాబా విమానాశ్రయంలో ల్యాండ్‌ కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

అయితే విమానంలోని ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. గమ్యస్థానం అడీస్‌ అబాబాకు చేరుకున్నా వారు నిద్ర లేవలేదు.. దీంతో ఆ విమానం ఆకాశంలో ప్రయాణించడం మొదలు పెట్టింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది (ATC) ఫ్లైట్ ET343 పైలట్‌లను సంప్రదించడానికి ప్రయత్నించింది. అయితే వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆటోపైలట్ డిస్‌కనెక్ట్ కావడంతో అలారం మ్రోగింది. అలారం శబ్దంతో హఠాత్తుగా నిద్రలేచిన పైలట్లు జరిగిన పొరబాటును గుర్తించారు.

వెంటనే అధికారుల సూచనలతో 25 నిమిషాల తర్వాత రన్‌వేపై విమానాన్ని సురక్షితంగా దింపారు. ఈ విషయాన్నీ ఏవియేషన్ నిఘా వ్యవస్థ ADS-B సంఘటనను ధృవీకరించింది. విమానం ప్రయాణించిన  మార్గం ఫోటోను పోస్ట్ చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..