Rishi Sunak: ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. భార్యతో కలిసి రిషి సునక్ భక్తివేదాంత మనోర్ ఆలయంలో పూజలు

Surya Kala

Surya Kala |

Updated on: Aug 20, 2022 | 8:54 AM

భారత సంతతికి చెందిన బ్రిటీష్ మాజీ ఛాన్సలర్ రిషి... భార్య అక్షతా తో కలిసి  భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు. కన్నయ్యకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.

Rishi Sunak: ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. భార్యతో కలిసి రిషి సునక్ భక్తివేదాంత మనోర్ ఆలయంలో పూజలు
Uk Pm Contender Rishi Sunak

Rishi Sunak: ప్రముఖ హిందూ పండుగ శ్రీ కృష్ణ జన్మాష్టమిని ప్రపంచ వ్యాప్తంగా కృష్ణ భగవానుడి భక్తులు వైభవంగా జరుపుకున్నారు. తమ సమీపంలోని కృష్ణ మందరిరాలను సందర్శించారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి రేసులో ఉన్న రిషి సునక్ జరుపుకున్నారు. రిషి సునక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి గురువారం ఆలయాన్ని సందర్శించారు. భారత సంతతికి చెందిన బ్రిటీష్ మాజీ ఛాన్సలర్ రిషి… భార్య అక్షతా తో కలిసి  భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు. కన్నయ్యకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అర్చకులు అందించిన స్వామివారి తీర్ధ ప్రసాదాలను దంపతులు తీసుకున్నారు. తాను “తాను ముందుగానే జన్మాష్టమిని జరుపుకోవడానికి ఈరోజు నేను నా భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించాను” అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరకు కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

తదుపరి బ్రిటీష్ ప్రధానమంత్రి రేసులో ఉన్న భారతీయ సంతతికి చెందిన నాయకుడు రిషి సునక్.   బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్ కు రిషి సునక్ గట్టిపోటీ ఇస్తోన్న విషయం తెలిసిందే. బోరిస్ జాన్సన్ ప్రభుత్వం నుండి వైదొలిగిన మాజీ మంత్రి. ఇప్పుడు చాలా సర్వేలలో UK విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ కంటే వెనుకబడి ఉన్నారు. అయితే, లిజ్‌ ట్రస్ కంటే రిషి సునక్ వెన‌క‌బ‌డ్డార‌ని  బుధవారం విడుదల చేసిన తాజా కన్జర్వేటివ్ హోమ్ సర్వే లో తేలింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu