Kangaroo :పెంచుకున్న కంగారూనే ఆ వృద్ధుడి ప్రాణం తీసింది.. చివరకు ఏం జరిగిందంటే..
వృద్ధుడి శరీరంపై పలు గాయాలున్నాయి. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి అంబులెన్స్ వచ్చేలోపే వ్యక్తి మృతి చెందాడు.
Kangaroo : ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 77 ఏళ్ల వృద్ధుడి హత్యలో అడవి కంగారుపై అనుమానం బలపడింది. పైగా ఆ అడవి కంగారు ఆ వృద్ధుడికి పెంపుడు జంతువు అని తెలిసింది. 86 ఏళ్లలో ఇంత ఘోరమైన కంగారూ దాడి జరగడం ఇదే తొలిసారి అని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం, ..పశ్చిమ ఆస్ట్రేలియాలోని రెడ్‌మండ్‌లోని ఓ ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం వృద్ధుడిని అతని బంధువులలో ఒకరు రక్షించారు. వృద్ధుడి శరీరంపై పలు గాయాలున్నాయి. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి అంబులెన్స్ వచ్చేలోపే వ్యక్తి మృతి చెందాడు.
ఆ వ్యక్తిపై కంగారు దాడి చేసి ఉంటుందని ఖచ్చితంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. “అంబులెన్స్ సిబ్బంది వ్యక్తిని రక్షించడానికి వెళ్ళినప్పుడు కంగారు వారిపై కూడా దాడికి యత్నించింది. దాంతో కంగారు వల్ల ప్రమాదం పెరుగుతుందనే కారణంగా చివరకు కంగారూను కాల్చిచంపాల్సి వచ్చిందని చెప్పారు. వృద్ధుడు కంగారును పెంపుడు జంతువుగా దత్తత తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.
కంగారు జాతిని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే, వెస్ట్రన్ గ్రే కంగారూ గ్రేట్ సదరన్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేక జాతికి చెందిన మగ కంగారూలు 2.2 మీటర్ల పొడవు మరియు 70 కిలోల వరకు బరువు పెరుగుతాయి. వివిధ ఆస్ట్రేలియన్ మీడియాలో ప్రచురించబడిన నివేదికల ప్రకారం, చివరిసారిగా 1936లో కంగారుచే ప్రాణాంతక దాడి జరిగింది. విలియం క్రూక్‌షాంక్ అనే 36 ఏళ్ల వ్యక్తి కంగారు దాడికి గురై మరణించాడు. కంగారు దాడిలో దవడ విరిగి తలకు గాయాలయ్యాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి