Viral Video: అయ్యోపాపం.. కారు స్టార్ట్ చేసి కిందికి దిగి రిపేర్ చేయబోయాడు.. అంతలో ఊహించని సీన్..!
ఇక్కడ ఒక వ్యక్తి ఇంటి ముందు కార్ పార్క్ చేశాడు. తిరిగి కారు స్టార్ట్ చేశాడు..కానీ, అది ముందుకు వెళ్లటం లేదు.. దాంతో అతడు.. కారుకు ఏదో రిపేర్ వచ్చినట్టుందని గ్రహించాడు...
Viral Video: ప్రమాదాలు ఎప్పుడు ఎట్నుంచి వస్తాయో ఎవరూ చెప్పలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అవతలి వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటంతో అది ప్రమాదాలకు కారణం కావొచ్చు. లేదంటే ఒక్కోసారి మన అజాగ్రత్త వల్లే ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇక్కడ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు స్టార్ట్ చేసిన రిపేర్ చేస్తుండగా ఊహించని సీన్ ఎదురైంది..దాంతో అతడు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు..అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఇక్కడ ఒక వ్యక్తి ఇంటి ముందు కార్ పార్క్ చేశాడు. తిరిగి కారు స్టార్ట్ చేశాడు..కానీ, అది ముందుకు వెళ్లటం లేదు.. దాంతో అతడు.. కారుకు ఏదో రిపేర్ వచ్చినట్టుందని గ్రహించాడు…కారు మందుకు వచ్చి బానెట్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత కారులోకి వెళ్లి కారు స్టార్ట్ చేశాడు. తర్వాత ముందుకు వచ్చి..కారు ఇంజన్ లో ఏం సమస్య వచ్చిందని పరిశీలిస్తున్నాడు. అయితే అప్పటికే కారు స్టార్ట్ చేసి ఉండడంతో ఒక్కసారిగా కారు ముందుకు కదలింది. అతన్ని ఢీకొట్టుకుంటూ ముందున్న షట్టర్ ను ఢీకొట్టింది. పాపం అతను కారు, షట్టర్ కు మధ్య ఇరుక్కుపోయాడు. అతడి అదృష్టం బాగుంది..అక్కడే ఉన్న కొందరు స్థానికులు గమనించిన వెంటనే స్పందించారు. అతడిని కాపాడే ప్రయత్నం చేశారు.. ఈ వీడియోను దీపక్ ప్రభు అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వైరల్ వీడియోతో పాటు..ఇలాంటి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఆటోమేటిక్ వాహనం చెడిపోయినట్లయితే… వాటి ముందు ఎప్పుడూ నిలబడకండి.. ఇలాంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు.
#WARNING If an automatic vehicle breaks down, never stand in front of the vehicle. Please warn your friends and relatives. Share this message as an example. pic.twitter.com/P2OPQDXgvg
— Deepak.Prabhu/दीपक प्रभू (@ragiing_bull) September 12, 2022
సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటివరకు లక్ష 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోపై నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి