Viral Video: అరెరే.. పూలకుండి దొంగిలించాలనుకుంది.. కట్ చేస్తే.. నడిరోడ్డుపై ఇలా గింగిరాలు పోయింది .. ఫన్నీ వీడియో..

దొంగలు రోడ్డుపై ఒక మొక్కలను దొంగిలించడం ఎప్పుడైనా చూశారా? ఈ చిన్న దొంగతనం కెమెరాకు చిక్కగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: అరెరే.. పూలకుండి దొంగిలించాలనుకుంది.. కట్ చేస్తే.. నడిరోడ్డుపై ఇలా గింగిరాలు పోయింది .. ఫన్నీ వీడియో..
Girl Tries To Steal Plant
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 13, 2022 | 12:11 PM

Viral Video: దొంగల్లోనూ అనేక రకాలుగా ఉంటారు..కొందరు చైన్‌ స్నాచర్లు, మొబైల్ ఫోన్‌లు లాక్కోని పారిపోయే దొంగలు. జేబు దొంగతనాలు చేయడం వంటి ఘటనలు తరచూ వింటుంటాం..అప్పుడప్పుడు చూస్తుంటాం కూడా.. కానీ, దొంగలు రోడ్డుపై ఒక మొక్కలను దొంగిలించడం ఎప్పుడైనా చూశారా? ఈ చిన్న దొంగతనం కెమెరాకు చిక్కగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో మెమె పేజీ ‘ఘంటా’ షేర్ చేసింది. కాగా, వీడియోకు 2.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అయితే, వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక యువతి స్కూటీ నడుపుతూ వచ్చింది. ఇంతలో రోడ్డుపై బయట కొన్ని అలంకార మొక్కలను ఉంచిన దుకాణం వైపు వెళుతోంది. దాంతో ఆ కుండీని దొంగతనం చేయటానికి ప్రయత్నిస్తుంది..ఒక సెకను ఆగి, మొక్కను దొంగిలించడానికి తన స్కూటీని వంచుతుంది. అయితే, ముందుగా తాను.. అటూ ఇటూ చూసుకుంది..తనను ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకుని తెల్లటి కుండీలో ఉన్న మొక్కను తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, పాపం ప్రయత్నం బెడిసికొట్టింది.. దెబ్బకు స్కూటీతో సహా గింగిరాలు తిరిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే…

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

చిన్న దొంగతనం ఆమె ప్రాణాల మీదకే తెచ్చింది. యువతి బైక్‌ బ్యాలెన్స్ తప్పి… ఆమె స్కూటీ ముందుకు దూసుకెళ్లింది. ద్విచక్రవాహనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఆమె రోడ్డుపై పడిపోయింది. నెటిజన్లు దీన్ని ఫన్నీగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆమె చేయబోయిన దొంగతనం నైపుణ్యాల గురించి జోక్ చేశారు. నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోకి నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి