Telugu News India News Stray dog attacks class 7 boy in kozhikode shocking visuals out Telugu News
Shocking Video: హడలెత్తిస్తున్న వీధి కుక్కలు.. 7వ తరగతి బాలుడిపై ఎలా దాడి చేశాయో చూస్తే వణికిపోతారు..
ఒకేచోట ఒకటీ రెండు కాకుండా పదుల సంఖ్యలో తిరుగుతున్న కుక్కలు జనం పిక్కలు పీకేస్తున్నాయి. ఇక ఒంటరిగా వెళ్తున్న వారు, చిన్నారులపై మరీ దారుణంగా దాడి చేస్తున్నాయి.
Shocking Video: ఇటీవల గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా వీధి కుక్కల స్వైర విహారమే కనిపిస్తుంది. గుంపులు గుంపులుగా సంచరిస్తున్న వీధికుక్కల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే జనం వణికిపోవాల్సి వస్తోంది. ఒకేచోట ఒకటీ రెండు కాకుండా పదుల సంఖ్యలో తిరుగుతున్న కుక్కలు జనం పిక్కలు పీకేస్తున్నాయి. ఇక ఒంటరిగా వెళ్తున్న వారు, చిన్నారులపై మరీ దారుణంగా దాడి చేస్తున్నాయి. వీధి కుక్కలే కదా అనుకుని పక్కనుంచి వెళదామనుకుంటే ఎక్కడ దాడి చేస్తాయో అని చిన్నారులు, పెద్దలు కూడ జంకుతున్నారు. తాజాగా కేరళ కోజికోడ్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది.
అరక్కినార్లో సైకిల్‌పై వస్తున్న నూర్ అనే 7వ తరగతి చదువుతున్న బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది. సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని వీధికుక్క వెంటాడి కొరికిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయి కుక్కల దాడి నుంచి తప్పించుకున్నాడు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీలో బాలుడిపై దాడి దృశ్యాలు నమోదయ్యాయి. జరిగిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీది కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి