Viral News: 44 లక్షల మంది సబ్ స్కైబర్లు.. అమ్మానాన్న తిట్టారని ఇంటి నుంచి పారిపోయిన యూట్యూబర్..
ఆమె ఆచూకీ కోసం తల్లిదండ్రులు తమ కూతురు ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్‌లోనే లైవ్ స్ట్రీమ్ తీస్తూ బయల్దేరారు. ఎట్టకేలకు యూట్యూబ్ ఛానెల్ ప్రేక్షకులు, పోలీసుల సాయంతో వారు తమ కూతురు కావ్యను సురక్షితంగా ఇంటికి తీసుకురాగలిగారు.
Viral News: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో అదృశ్యమైన కావ్య యాదవ్ మధ్యప్రదేశ్‌లోని ఓ రైలు కోచ్‌లో ప్రత్యక్షమైంది. ఆమె ఆచూకీ కోసం తల్లిదండ్రులు తమ కూతురు ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్‌లోనే లైవ్ స్ట్రీమ్ తీస్తూ బయల్దేరారు. ఎట్టకేలకు యూట్యూబ్ ఛానెల్ ప్రేక్షకులు, పోలీసుల సాయంతో వారు తమ కూతురు బిందాస్ కావ్యను సురక్షితంగా ఇంటికి తీసుకురా గలిగారు. ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళితే…
బిందాస్ కావ్య అని పిలువబడే 16 ఏళ్ల యూట్యూబర్ తన తండ్రి మందలించడాని ఇంట్లోకి పారిపోయింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బాలిక కనిపించకుండా పోయిందని, పొరుగు రాష్ట్రంలోని ఇటార్సీ రైల్వే స్టేషన్‌లోని రైలు కోచ్‌లో బాలిక కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చిన క్షణాన్ని ఆమె తల్లిదండ్రులు రికార్డ్ చేశారు. దాని వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతుంది.
యువతికి YouTubeలో 4.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సాధారణంగా ప్లాట్‌ఫారమ్‌లో గేమింగ్, లైఫ్‌స్టైల్ కంటెంట్,వ్లాగ్‌లను సృష్టించడం కనిపిస్తుంది. ఆమె తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 9న సదరు యువతి కనిపించకుండా పోయింది. దాంతో తమ కూతురు మిస్సింగ్ విషయం ఆమె ఫాలోవర్స్‌కి తెలియజేయడానికి ఆమె తల్లిదండ్రులు ఆమె యూట్యూబ్ ఛానెల్‌తో పాటు ఆమె ట్విట్టర్ హ్యాండిల్‌ను ఉపయోగించారు. “సెప్టెంబర్ 9, మధ్యాహ్నం 2 గంటల నుండి మా కుమార్తె తప్పిపోయింది మరియు పోలీసులు ఇంకా వెతకడం లేదు. దయచేసి మాకు సహాయం చేయండి. ‘కహీ దేర్ నా హో జాయే’ (ఇది చాలా ఆలస్యం కాకూడదని ఆశిస్తున్నాను). దయచేసి @DGPMaharashtra @AbadCityPolice #searchbindasskavya రీట్వీట్ చేయండి. అంటూ కుటుంబ సభ్యులు ట్వీట్లు చేయసాగారు. కూతురి యూట్యూబ్ ఛానెల్‌లోనే వారు తమ కష్టాలను ప్రత్యక్ష ప్రసారం చేసారు. దాంతో పోలీసులు ఆమెను కనిపెట్టి వారికి సమాచారం అందించారు. అలా వారు ఆమెను పికప్ చేసుకోవడానికి బయల్దేరారు. సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను ఇంట్లో తిరిగి కలుసుకున్న తర్వాత వారి భావోద్వేగాలను కూడా వీడియోలో షేర్ చేశారు. ఇంతకీ ఆ యువతి ఎలా దొరికింది..అన్న విషయాన్ని వస్తే…
Missing from Aurangabad (Maharashtra) since Sep 9, 16-years-old popular YouTuber Kavya Yadav was tracked in sleeper coach of Gorakhpur bound Kushinagar Express train in Itarsi (MP). She was reunited with parents on Saturday night. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/WUXj87mb4b
— Anuraag Singh (@anuraag_niebpl) September 11, 2022
తల్లిదండ్రులు మందలించడంతో యువతి ఇంటి నుంచి పారిపోయినట్టుగా రైల్వే పోలీసులకు సమాచారం అందినట్టుగా ఇటార్సీ GRP సబ్-ఇన్‌స్పెక్టర్ విభేందు వ్యంక్తేష్ తాండియా తెలిపారు. ఔరంగాబాద్‌లోని చావోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె కనిపించకుండా పోయిందని, ఔరంగాబాద్‌కు 500కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటార్సీ రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్లలో ఆమె ఫోటోగ్రాఫ్‌ల సహాయంతో తనిఖీలు ముమ్మరం చేసినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం భుసావల్ నుండి వస్తున్న ఖుషీనగర్ ఎక్స్‌ప్రెస్‌లోని స్లీపర్ కోచ్‌లో ఆమెను GRP గుర్తించి, ఆపై ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సబ్-ఇన్‌స్పెక్టర్ తెలిపారు. బాలిక ఫోటోల ఆధారంగా రైళ్లలో తనిఖీ చేస్తుండగా ఆమెను రైలు కోచ్‌లో గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు శనివారం అర్థరాత్రి ఇటార్సికి చేరుకున్నారని,దీంతో బాలికను సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి