Health tips: తిన్న వెంటనే స్నానం చేయకూడదంటారు… ఎందుకో తెలుసా.. ఇకపై జాగ్రత్త!

జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అది కొంతమందిలో కొన్ని రకాల అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Health tips: తిన్న వెంటనే స్నానం చేయకూడదంటారు... ఎందుకో తెలుసా.. ఇకపై జాగ్రత్త!
Bathing
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 12, 2022 | 12:45 PM

Health tips: భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు అంటారు..కానీ, అది ఎందుకో చాలా మందికి తెలియదు. తెలిసో, తెలియకో భోజనం చేసిన తర్వాత..వెంటనే స్నానం చేసేఅలవాటు ఉంటేగనుక..ఆ అలవాటును మీరు వెంటనే మానుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే…భోజనం చేసిన తర్వాత చేసే పనుల కారణంగా.. జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అది కొంతమందిలో కొన్ని రకాల అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదంలోనూ ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెబుతారు.. దీని వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉదరంలో వ్యర్థాలు పెరుకుపోవడం వల్ల మొటిమలు, చర్మ అలెర్జీలు వంటి సమస్యలు కూడా వస్తాయి.

భోజనం చేసిన తర్వత..ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి, పొట్టకు సరైన మొత్తంలో రక్తప్రసరణ అవసరం. అయితే స్నానం వల్ల ఆ రక్తం చర్మం వైపు ప్రసరించి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. దీంతో ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీంతో అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే భోజనం చేసిన గంట, గంటన్నర తర్వాత స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి