AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tooth Floss: మనలో 90 శాతం మంది పళ్ళు తోముకునేటప్పుడు ఈ పొరపాటు చేస్తారు.. బ్రష్ చేయడమే కాకుండా ఇలా కూడా చేయండి

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రష్ చేయడంతో పాటు ఫ్లాస్ చేయడం కూడా చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో దంతాల మధ్య పేరుకుపోయినది తొలగిపోయి బ్యాక్టీరియా పెరగదు.

Tooth Floss: మనలో 90 శాతం మంది పళ్ళు తోముకునేటప్పుడు ఈ పొరపాటు చేస్తారు.. బ్రష్ చేయడమే కాకుండా ఇలా కూడా చేయండి
Tooth Floss
Sanjay Kasula
|

Updated on: Sep 12, 2022 | 1:12 PM

Share

దంతాలను రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ద్వారా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ దంతాలు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. వారు నవ్వినప్పుడు తెల్లని పళ్ళు కనిపించాలని ఆశిస్తుంటారు. పసుపు, మురికి పళ్ళు కాదు. ఆరోగ్యకరమైన దంతాలు కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.. ఎందుకంటే వాటి సహాయంతో మాత్రమే మనం ఆహారాన్ని నమలగలుగుతాం. దంతాలు లేకపోతే ఆహారాన్ని నమలలేం. దంతాలు శుభ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ బ్రష్ చేయడం చాలా అవసరమని చెబుతున్నారు. కొంతమంది ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత రెండు సార్లు బ్రష్ చేస్తుంటారు. అయితే దంతాలను శుభ్రం చేయడానికి కేవలం బ్రష్ చేయడం మాత్రమే సరిపోదు. దంతాలు ఫ్లాస్ చేయడం చాలా ముఖ్యం. మీరు ఫ్లాస్ థ్రెడ్ సహాయంతో మీ దంతాలను శుభ్రం చేస్తే, దంతాలలో బ్యాక్టీరియా ఎప్పటికీ పెరగదు.

దంతాల ఫ్లాసింగ్ చేస్తే ప్రయోజనాలు ఇవే..

ఫ్లాసింగ్ చేయడం వల్ల దంతాల మధ్య చిక్కుకున్న మురికి చాలా తేలికగా బయటకు వస్తుంది. ప్రతిరోజూ బ్రష్ చేసిన తర్వాత కూడా కొంతమందికి దంతాలు శుభ్రంగా ఉండవు. వాటి పళ్లలో మురికి అలానే ఉండిపోతుంది. ఈ గందరగోళాన్ని తొలగించడానికి మీరు ఫ్లాస్ థ్రెడ్‌ని ఉపయోగించవచ్చు. ఫ్లాస్ చేయడం ద్వారా.. దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహారం  బయటకు వచ్చి నోరు శుభ్రంగా మారుతుంది.

దంతాలు ఫ్లాస్ చేయడం ఎలా?

దంతాలను ఫ్లాస్ చేయడానికి.. మొదట పట్టు లేదా సాధారణ సన్నని దారాన్ని తీసుకోండి. దీని తరువాత, మీ చేతులతో థ్రెడ్ రెండు చివరలను పట్టుకోండి. ఆ తర్వాత దారాన్ని పళ్లలోకి పంపించి పై నుంచి కిందకు అనాలి. ఇలా చేయడం వల్ల దంతాల మధ్య చిక్కుకున్న మురికి బయటకు వచ్చేస్తుంది. ఫ్లాసింగ్‌తో దంత క్షయం, చిగుళ్ల వ్యాధుల అవకాశాలను తగ్గిస్తుంది. ఫ్లోసింగ్ తర్వాత, మీరు మీ నోటిని నీటితో లేదా మౌత్ వాష్‌తో శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ నోరు పూర్తిగా శుభ్రంగా ఉంటుంది.

చిగుళ్ళలో పేరుకుపోయిన బ్యాక్టీరియా గుండె జబ్బులకు దారి తీస్తుంది. దీనికి సంబంధించి వైద్యులు శాస్త్రీయ అంశాలను జర్నల్‌లో సూచించారు. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చిగుళ్లు, దంతాలు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి. దంతాలు శుభ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ బ్రష్ చేయడం చాలా అవసరమని చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం