Health Tips: ఆరోగ్యానికి మంచిదని ఆ నూనెను ఎప్పుడుపడితే అప్పుడు వాడేస్తున్నారా.. దానికీ ఓ లెక్కుందంట..

నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ ఈ నూనెను ఏడాది పొడవునా ఉపయోగించలేరు. ఇలా చేయడం వల్ల లాభానికి బదులు నష్టం వస్తుంది.

Health Tips: ఆరోగ్యానికి మంచిదని ఆ నూనెను ఎప్పుడుపడితే అప్పుడు వాడేస్తున్నారా.. దానికీ ఓ లెక్కుందంట..
Sesame Oil
Follow us
Venkata Chari

|

Updated on: Sep 12, 2022 | 2:22 PM

శతాబ్దాలుగా నువ్వుల నూనె మన ఆహారంలో భాగం. పూర్వకాలంలో దేశీ నెయ్యి దొరకని ఇళ్లలో నెయ్యికి బదులు నువ్వులనూనె, కాయగూరలు, కిచడీలో కలిపి తినేవారు. ఈ నూనె ఆరోగ్య గుణాలను మాత్రమే కాకుండా రుచిని కూడా కలిగి ఉంటుంది. ఈ నూనెను మసాజ్ చేయడానికి, చర్మం మెరుపును పెంచడానికి కూడా ఉపయోగిస్తారు. విశేషమేమిటంటే, ఈ నూనె తినడానికి సరైన సమయం ఉంది. మీరు చర్మంపై లేదా ఇతర పనులలో ఈ నూనెను ఉపయోగించవచ్చు. కానీ, ఇది ఆహారంలో ప్రతి సీజన్లో ఉపయోగించకూడదు. చలికాలంలో చలి బాధించకుండా ఈ నూనెను ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నువ్వుల నూనెను ఎప్పుడు ఉపయోగించాలి..

సెప్టెంబరు నెల వచ్చేసింది.  అయితే, ఈ నెల నుంచి వాతావరణంలో మార్పులు కూడా వస్తుంటాయి. అంటే చలికాలం ఆరంభం కాబోతుంది. అందుకే పరిమిత పరిమాణంలో నువ్వుల నూనెను ఉపయోగించడం ప్రారంభించవచ్చంట. అక్టోబరులో ఆ పరిమాణం కాస్త పెంచి, ఇలా డిసెంబర్ వరకు ఎక్కువగా వాడుకోవచ్చు. అయితే, డిసెంబర్ తర్వాత, దాని వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. కాబట్టి ఫిబ్రవరి నాటికి, ఈ నూనె వేడి శరీరం లోపల చల్లబడటం ప్రారంభమవుతుంది. మార్చి-ఏప్రిల్‌లో ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి, తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. నువ్వుల నూనెను వినియోగించే అసలు సాంప్రదాయ పద్ధతి ఇదేనని పెద్దలు చెబుతుంటారు. ఇలా వాడుకోవడం ద్వారా శరీరం చలికాలం నుంచి తనను తాను రక్షించుకోవడానికి సిద్ధమవుతుందని వారి నమ్మకం.

ఇవి కూడా చదవండి

నువ్వుల నూనెను ఎలా తీసుకోవాలి?

  1. నువ్వుల నూనె తినడానికి చాలా రుచిగా ఉంటుంది. నెయ్యిలాగా వాడుకుని తినవచ్చు.
  2. అలాగే దీన్ని వైల్డ్ సలాడ్ లేదా స్నాక్స్‌లో కూడా ఉపయోగించవచ్చు.
  3. ఈ నూనెను పప్పు, కూరగాయలలో టెంపరింగ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
  4. ఈ నూనెను పూరీలు, పరాటాల తయారీలో కూడా ఉపయోగించవచ్చు.
  5. ఈ నూనె చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తుంటారు.
  6. ఇంట్లో ఆవు పాలతో చేసిన స్వచ్ఛమైన దేశీ నెయ్యి లేని సమయంలో, నువ్వుల నూనెను పూజలో ఉపయోగిస్తారు.

నువ్వుల నూనె ఉపయోగాలు..

  1. నువ్వుల నూనెలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. భాస్వరంకు ఇది మంచి మూలం.
  2. విటమిన్ డి, ఇ, కె కలిగి ఉంటుంది.
  3. నువ్వుల నూనె వాత, కఫాలను నియంత్రిస్తుంది.
  4. దీని వినియోగం వల్ల దగ్గు, శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులు దరిచేరవు.
  5. నువ్వుల నూనె ప్రభావంలో చాలా వేడిగా ఉంటుంది. దీని వినియోగం జలుబు కారణంగా వచ్చే వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
  6. నువ్వుల నూనెను చర్మంపై అప్లై చేయడం వల్ల గ్లో పెరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోవాలి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా