AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత వింత జీవి.. బల్లిలా కనిపిస్తున్నా.. దీని స్పెషాలిటీలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఆక్సోలోట్ల్ దాని స్వంత శరీర భాగాలను పునరుత్పత్తి చేస్తుందని 1964 లో మొదటిసారిగా కనుగొన్నారు. ఇది మొదటిసారిగా 1964లో కనుగొన్నారు. ఆ సమయంలో..

ప్రపంచంలోనే అత్యంత వింత జీవి.. బల్లిలా కనిపిస్తున్నా.. దీని స్పెషాలిటీలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Axolotl Are Salamander Genus
Venkata Chari
|

Updated on: Sep 09, 2022 | 8:00 AM

Share

ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జంతువులు, మొక్కలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఆక్సోలోట్ల్ ఒకటి. ఇది తన గుండె, మెదడు, వెన్నుపాము లాంటి అవయవాలను పునరుత్పత్తి చేయగల ఒక జీవిగా పేరుగాంచింది. దీని జాతి సాలమండర్. ఆక్సోలోట్ల్ జీవితాంతం న్యూరాన్‌లను అభివృద్ధి చేస్తూనే ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఇటీవల, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఇది ఎలా జరుగుతుందనే దానిపై పరిశోధన చేసి, ఎన్నో సంచలన విషయాలు తేల్చారు.

ఆక్సోలోట్ల్ దాని స్వంత శరీర భాగాలను పునరుత్పత్తి చేస్తుందని 1964 లో మొదటిసారిగా కనుగొన్నారు. ఇది మొదటిసారిగా 1964లో కనుగొన్నారు. ఆ సమయంలో, వయోజన ఆక్సోలోట్ల్ మెదడులో సగానికి పైగా తొలగిపోయినా, అది మెదడును మళ్లీ అభివృద్ధి చేయగలదని పరిశోధకులు కనుగొన్నారు.

ఆక్సోలోట్ల్ పునరుత్పత్తి ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, శాస్త్రవేత్తలు దాని మెదడు మ్యాప్‌ను తయారు చేశారు. ఇది ఒక జీవి మెదడు ఒక జాతిగా పరిణామం చెందడం గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది. ఆక్సోలోట్ల్ మెదడులోని అన్ని భాగాలకు సంబంధించిన కణాలను తిరిగి అభివృద్ధి చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి తన జీన్స్ సహాయంతో ఇలా తయారుచేస్తుందని కనుగొన్నారు. దీన్ని అర్థం చేసుకోవడానికి, శాస్త్రవేత్తలు కణాల అభివృద్ధికి సహాయపడే జన్యువులను లెక్కించడానికి ఒక జీవి సింగిల్ సెల్ RNA సీక్వెన్సింగ్ (scRNA-seq) ప్రక్రియను చూశారు.

ఈ విధంగా కొత్త మెదడు అభివృద్ధి..

ఆక్సోలోట్ల్ మెదడు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందని అధ్యయనం చూపిస్తుంది. శాస్త్రవేత్తలు జీవి మెదడులోని అతిపెద్ద భాగమైన టెలెన్సెఫలాన్‌ను బయటకు తీశారు. దాని లోపల నియోకార్టెక్స్ ఉంది. ఇది ఏదైనా జీవి ప్రవర్తన, అభిజ్ఞా శక్తిని బలపరుస్తుంది. ఇలా చేసిన 12 వారాల తర్వాత, ఆక్సోలోట్ల్ మెదడుకు కొత్త కణాలను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుందంట.

మొదటి దశలో, ప్రొజెనిటర్ కణాలు ఆక్సోలోట్ల్‌లో వేగంగా పెరుగుతాయి. గాయాలను నయం చేయడానికి పని చేస్తాయంట. రెండవ దశలో, పుట్టుకతో వచ్చిన కణాలు న్యూరోబ్లాస్ట్‌లుగా విభేదిస్తాయి. మూడవ దశలో, న్యూరోబ్లాస్ట్‌లు వ్యక్తిగత న్యూరాన్‌లుగా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. ఇవి టెలిన్సెఫలాన్ నుంచి బయటకు వచ్చిన న్యూరాన్లు. కొత్త న్యూరాన్లు మెదడులోని పాత భాగాలతో అనుసంధానం చేసి కొత్త మెదడును అభివృద్ధి చేస్తాయి.