Viral: ప్రైవేటు పార్ట్‌లో తీవ్రమైన నొప్పింటూ అస్పత్రికొచ్చాడు.. ఎక్స్‌రే చూడగా డాక్టర్ల మైండ్ బ్లాంక్!
అప్పుడప్పుడూ మనం చూసే కొన్ని వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అసలు అలా.? ఎలా.? జరిగి ఉండొచ్చు అనే సందేహం కలుగుతుంది.

అప్పుడప్పుడూ మనం చూసే కొన్ని వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అసలు అలా.? ఎలా.? జరిగి ఉండొచ్చు అనే సందేహం కలుగుతుంది. సరిగ్గా ఈ న్యూస్ కూడా అలాంటిదే. ఇక్కడ ఓ బాలుడు చేసిన పిచ్చి పని.. అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. అదేంటో తెలిస్తే.. మీరు షాక్ కావడం ఖాయం.
వివరాల్లోకి వెళ్తే.. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడు ఓ విచిత్ర సెక్యువల్ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా తన జననాంగంలోకి యుఎస్‌బీ కేబుల్‌ను జొప్పించాడు. ఆ బాలుడు మర్మాంగం ఎంత పొడవుందో లోపల నుంచి కొలిచేందుకు ఇలా చేశాడని తెలుస్తోంది. అయితే ఆ కేబుల్ బాలుడి మర్మాంగం లోపల ఇరుక్కుపోవడంతో.. మూత్రం నుంచి రక్తం వచ్చింది. దీనితో కంగారుపడిన అతడి తల్లి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది.
ఆస్పత్రిలోని డాక్టర్లు బాలుడికి స్కానింగ్ చేసి.. అనంతరం వచ్చిన ఎక్స్‌రే చెక్ చేయగా.. కేబుల్ పురుషాంగంలో చిక్కుకున్నట్లు గుర్తించారు. అసలు ఇది ఎలా జరిగిందని డాక్టర్లు.. సదరు బాలుడ్ని ప్రశ్నించగా.. తల్లి తన పక్కన లేని సమయంలో.. పురుషాంగాన్ని కొలిచేందుకు ఉద్దేశపూర్వకంగానే కేబుల్‌ను జోప్పించినట్లు అతడు వైద్యుల ముందు అంగీకరించాడు.
“యుఎస్‌బీ వైర్‌కు సంబంధించిన రెండు డిస్టల్ పోర్ట్‌లు బాహ్య మూత్ర విసర్జన నుంచి పొడుచుకు వచ్చినట్లు కనుగొన్నాం. అయితే ముడిపడిన వైర్ మధ్య భాగం మాత్రం మూత్రాశయంలోనే ఉంది. రోగి ఆరోగ్యంగానే ఉన్నాడు. ఎలాంటి మానసిక రుగ్మతలు లేవు” అని డాక్టర్స్ తమ సైన్స్ జర్నల్‌లో రాసుకొచ్చారు.
మొదటిగా డాక్టర్లు ఆ కేబుల్‌ను మెటల్ రాడ్ ద్వారా తొలగించలేకపోయారు. అయితే అనంతరం శస్త్రచికిత్స నిర్వహించి.. జాగ్రత్తగా యుఎస్‌బీ కేబుల్‌ను బయటకు తీశారు. కాగా, బాలుడి ఆరోగ్యంగానే ఉన్నాడని.. పక్షం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి అనంతరం డిశ్చార్జ్ చేశామని డాక్టర్స్ చెప్పారు. అలాగే మూత్రనాళంలోకి ఇలాంటివి జొప్పించడం వల్ల మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం రావడం, ఇబ్బందికరమైన అంగస్తంభన, మూత్రం నిలుపుదల వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని డాక్టర్స్ తమ కేస్ స్టడీలో పేర్కొన్నారు.(Source)
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..