Prince Andrew: బ్రిటన్‌ కొత్త చక్రవర్తి కింగ్ చార్లెస్ IIIకి పదవితోపాటు వచ్చే ప్రత్యేక హక్కులు ఇవే.. ప్రపంచంలో మరెవ్వరికీ ఇవి లేవు..

96 యేళ్ల వయసులో బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-2 గురువారం (సెప్టెంబర్‌ 8, 2022) మరణించిన విషయం తెలిసిందే. క్వీన్‌ ఎలిజబెత్‌-2 తర్వాత ఆమె పెద్ద కుమారుడు కింగ్ చార్లెస్ III (రెండో కుమారుడు ప్రిన్స్‌ ఆండ్రూ) బ్రిటన్‌ సామ్రాజ్యాధినేతకానున్నారు. ఈ సందర్భంగా..

Prince Andrew: బ్రిటన్‌ కొత్త చక్రవర్తి కింగ్ చార్లెస్ IIIకి పదవితోపాటు వచ్చే ప్రత్యేక హక్కులు ఇవే.. ప్రపంచంలో మరెవ్వరికీ ఇవి లేవు..
King Charles
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 09, 2022 | 1:47 PM

King Charles Will Travel Without Passport, know the reason: 96 యేళ్ల వయసులో బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-2 గురువారం (సెప్టెంబర్‌ 8, 2022) మరణించిన విషయం తెలిసిందే. క్వీన్‌ ఎలిజబెత్‌-2 తర్వాత ఆమె పెద్ద కుమారుడు కింగ్ చార్లెస్ III బ్రిటన్‌ సామ్రాజ్యాధినేతకానున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్‌ రాజ వంశీకులకు ఉండే ప్రత్యేక హోదాలు, సదుపాయాల గురించి తెలుసుకుందాం..

లైసెన్స్/పాస్‌పోర్ట్ లేకుండా ఎక్కడికైనా వెళ్లే ఏకైక వ్యక్తి అతడే..

రాణి ఎలిజబెత్‌ తర్వాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ III బ్రిటన్‌కు కొత్త రాజుగా నియామకంకానున్నారు. బ్రిటన్‌ రాజుగా కింగ్‌ చార్లెస్‌ పాస్‌పోర్ట్ లేకుండానే ప్రపంచంలో ఏ దేశానికైనా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే రాజుగా నియమించే సందర్భంలో అతని పేరు మీద ఓ డాక్యుమెంట్‌ మంజూరు చేస్తారు. అందువల్లనే రాయల్‌ ఫ్యామిలీలో కింగ్‌ చార్లెస్‌ మాత్రమే ఎటువంటి లైసెన్స్‌, పాస్‌పోర్టు లేకుండా విదేశీ ప్రయాణాలు చేయడానికి అనుమతి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రెండు పుట్టినరోజులు

క్వీన్ ఎలిజబెత్ II రెండు పుట్టినరోజులు జరుపుకునేవారు. ఒకటి ఆమె అసలు పుట్టినరోజు ఏప్రిల్ 21 కాగా, ఇక రెండోది జూన్‌లో వచ్చే రెండో మంగళవారం. అంటే ఎండాకాలంలో ఒకటి, శీతా కాలంలో ఒకటి. అదేవిధంగా కొత్త రాజు చార్లెస్ కూడా రెండు పుట్టిన రోజులు జరుపుకుంటారు. శీతాకాలంలో వచ్చే అసలు పుట్టిన రోజు నవంబర్ 14న మొదటిది, ఎండా కాలంలో రెండోది జరుపుకునే అవకాశం ఉంది. బ్రిటన్‌ రాజు లేదా రాణి పుట్టిన రోజు వేడుకలు బహిరంగ వేదికలో అట్టహాసంగా జరుగుతాయి. ఈ సంప్రదాయం 250 యేళ్ల నాటి నుంచి కొనసాగుతోంది. 1,400లకుపైగా సైనికుల కవాతు, 200 గుర్రాలు, 400 మంది మ్యుజీషియన్లు (సంగీతకారులు) ఈ వేడుకలో పాల్గొంటారు. సెంట్రల్ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి రాజ కుటుంబ సభ్యులు చూస్తుండగా.. రాయల్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

ఓట్లు లేవు.. ఓటింగ్ అసలే లేదు

బ్రిటిష్ చక్రవర్తులు ఎన్నికలకు నిలబడడం, ఓట్లు వేయడం అనే పద్ధతులను పాటించరు. ఎందుకంటే వంశపారంపర్యంగా రాజవంశీకులు పాలించే దేశం కాబట్టి తమ వంశంలో రాజు లేదా రాణి ఏకచక్రధిపత్యం వహిస్తారు. వీరు రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనడం, పార్లమెంటరీ సమావేశాలను లాంఛనంగా ప్రారంభించడం, పార్లమెంటు నుండి చట్టాన్ని ఆమోదించడం, వారానికోసారి ప్రధానమంత్రితో సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.

రాజవంశీకుల సంరక్షణలో హంసలు, డాల్ఫిన్లు

బ్రిటీష్ రాజవంశికులు ప్రజలను మాత్రమే పరిపాలించడు. ఇంగ్లాండ్ జలాల్లో నివసించే నీటి జీవాలు, పక్షలు చక్రవర్తి ఆస్తిగా పరిగణించబడగాయి. హంసలు, డాల్ఫిన్లు వంటి సంరక్షణ బాధ్యతలు 12వ శతాబ్ధం నుంచి అనాదిగా చేపడుతున్నారు.

అధికారిక కవి

ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి బ్రిటన్ చక్రవర్తి కోసం అధికారిక కవిని నియమించడం 17వ శతాబ్ధం నుంచి ఆచారంగా వస్తోంది. 2009లో కరోల్ ఆన్ డఫీ అనే మహిళను పొయట్‌ (కవి)గా నామినేట్ చేశారు. కవిగా ఉన్న తొలి మొదటి మహిళ కూడా ఆమె. 2011లో ప్రిన్స్ విలియం వివాహం, 2013లో క్వీన్ ఎలిజబెత్ II 60వ వార్షికోత్సవం, 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం కోసం కరోల్ ఆన్ డఫీ పద్యాలు కంపోజ్ చేసింది.

రాయల్ వారెంట్

చక్రవర్తికి క్రమం తప్పకుండా సేవలు, వస్తువులు సరఫరా చేసేవారికి రాయల్‌ వారెంట్‌ ఉంటుంది. వారెంట్ పొందిన కంపెనీలు తయారు చేసే వస్తువులు, ఆయుధాలను ఉపయోగించేందుకు అధికారం ఉంటుంది. బర్బెర్రీ, క్యాడ్‌బరీ, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్, శాంసంగ్, వెయిట్రోస్ సూపర్ మార్కెట్‌ వంటి వాటికి రాయల్ వారెంట్ ఉంది.