AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohinoor Diamond: క్వీన్‌ ఎలిజబెత్‌ తర్వాత మన ‘కోహినూర్‌’ ఇక ఆమె సిగపైనే! భారత్‌ నుంచి బ్రిటన్ వరకు కోహినూర్ ప్రయాణం ఇలా..

బ్రిటన్‌ను 70 ఏళ్లపాటు ఏలిన క్వీన్‌ ఎలిజబెత్‌-2 గురువారం 96 యేళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఐతే ఎలిజబెత్‌-2 తర్వాత కోహినూర్‌ ఎవరి సిగలో అలంకరించనున్నరనే విషయం ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది..

Kohinoor Diamond: క్వీన్‌ ఎలిజబెత్‌ తర్వాత మన ‘కోహినూర్‌’ ఇక ఆమె సిగపైనే! భారత్‌ నుంచి బ్రిటన్ వరకు కోహినూర్ ప్రయాణం ఇలా..
Kohinoor Diamond
Srilakshmi C
|

Updated on: Sep 09, 2022 | 1:46 PM

Share

Who is Camilla, UK’s Queen-to-be who will wear Kohinoor? బ్రిటన్‌ను 70 ఏళ్లపాటు ఏలిన క్వీన్‌ ఎలిజబెత్‌-2 గురువారం 96 యేళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఐతే ఎలిజబెత్‌-2 తర్వాత కోహినూర్‌ ఎవరి సిగలో అలంకరించనున్నరనే విషయం ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. ఐతే యువరాజుగా పట్టాభిషేకం పొందనున్న కింగ్‌ ఛార్లెస్‌ అర్ధాంగి కెమిల్లాకు రాణి హోదా దక్కుతుంది. సాధారణంగా రాజవంశీకుల్లో రాజు భార్యకు సహజంగానే రాణి హోదా వస్తుంది. దీంతో కోహినూర్‌ వజ్రంతో పొదిగి ఉన్న ఎలిజబెత్ కిరీటం కెమిల్లాకు వెళ్లనుంది. బ్రిటన్‌లో జరిగిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో రాణి ఎలిజబెత్‌-2 స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తన తర్వత కోడలు కెమిల్లా కోహినూర్ పొదిగిన కిరీటం అదిరోహించాలని తన ప్రసంగంలో ఆకాంక్షించారు. భారత్‌ నుంచి ఎన్నో చేతులు మారిన కోహినూర్‌ 1849లో బ్రిటీష్‌ వాళ్లు పంజాబ్‌ను ఆక్రమించిన తర్వాత కోహినూర్‌ను తమ దేశానికి తరలించారు. ఆ తర్వాత 1937లో కింగ్ జార్జ్‌-6 ప్లాటినంతో తయారు చేసిన కిరీటంలో 105.6 క్యారెట్ల కోహినూర్‌ను ఉంచి దానిని తన పట్టాభిషేక సమయంలో తన సతీమణికి అలంకరించాడు. అప్పటి నుంచి రాజ కుటుంబీకుల కిరీటంలో మన కోహినూర్‌ వెలుగులీనుతోంది. అది ఇప్పుడు ఎలిజబెత్‌-2 నుంచి కెమిల్లాకు చేరుతుంది. ఐతే ప్రిన్స్‌ చార్లెస్‌కు కెమిల్లా రెండో భార్య. మొదటి భార్య ప్రిన్స్‌ డయానాకు 1996కు విడాకులిచ్చారు. ఆమె ఏడాదికే ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

Follow Us
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఇలా తెలుసుకోండి..
తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఇలా తెలుసుకోండి..