AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సారూ.. మీరే న్యాయం చెయ్యాలి! పెన్షన్‌కు అప్లై చేస్తే.. చనిపోయానని అంటున్నారు..’

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెంలో వృద్ధ వికలాంగురాలుకి వింత అనుభవం ఎదురైంది. బతికుండగానే ఆమె చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యింది. ఫెన్షన్ కోసం వెళ్తే.. చనిపోయినట్లు రికార్డులో నమోదు కావడంతో..

'సారూ.. మీరే న్యాయం చెయ్యాలి! పెన్షన్‌కు అప్లై చేస్తే.. చనిపోయానని అంటున్నారు..'
Disabled Pension
Srilakshmi C
|

Updated on: Sep 09, 2022 | 9:59 AM

Share

Bhadradri Kothagudem news: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెంలో వృద్ధ వికలాంగురాలుకి వింత అనుభవం ఎదురైంది. బతికుండగానే ఆమె చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యింది. పెన్షన్ కోసం వెళ్తే.. చనిపోయినట్లు రికార్డులో నమోదు కావడంతో కంగుతినింది ఆ ముసలావిడ. ఫెన్షన్ రావాలంటే బతికున్నట్లు సర్టిఫికేట్ తీసుకురావాలని అధికారులు చెప్పడంతో లబోదిబోమంది. ఈ వయస్సులో ఎక్కడని తిరిగి సరిఫికేట్ సాధించేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పెన్షన్ ఇవ్వకపోయినా పర్వవాలేదూ.. కనీసం నేను బ్రతికున్నట్లు గుర్తించాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది వృద్ధురాలు. వివరాల్లోకెళ్తే.. సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామానికి చెందిన దండు సీతమ్మ అనే 69 ఏళ్ల వికలాంగురాలు 2019లో మీసేవ ద్వారా ఆసరా ఫెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. రీసెంట్ గా వచ్చిన కొత్త ఫెన్షన్ల లిస్టులో ఆమె పేరు రాకపోగా ఆమె చనిపోయినట్లు అధికారులు చెప్పడంతో ఇదేం కర్మ దేవుడా అంటూ తల పట్టుకుంది సీతమ్మ. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతుంది ఆమె. వృద్ధాప్య దశలో నిస్సహాస్థితిలో మా దంపతులము ఉన్నామంటూ ఆవేదన వ్యక్తంచేసింది. మాకు కలెక్టరే న్యాయం చేయాలని వేడుకుంటుంది.