Medical Posts: తెలంగాణలో హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులు.. నేరుగా మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

Medical Posts: మిడ్‌ లెవెల్‌ హెల్తడ్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న బస్తీ, పల్లెద దవాఖానాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా...

Medical Posts: తెలంగాణలో హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులు.. నేరుగా మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Mlhp Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 09, 2022 | 11:46 PM

Medical Posts: మిడ్‌ లెవెల్‌ హెల్తడ్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న బస్తీ, పల్లెద దవాఖానాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 53 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 53 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ పోస్టుల భర్తీ సమయంలో ఎంబీబీఎస్‌ చేసిన వారు దరఖాస్తు చేసుకోని పక్షంలో.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్‌ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్‌ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని పరిగణలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను, సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలను డీఎంహెచ్‌వో కార్యాలయం, ఆదిలాబాద్‌ అడ్రస్‌కు పంపించాలి.

* ఎంపికైన ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌ వైద్యులకు నెలకు రూ.40 వేలు, ఈ పోస్టులో పనిచేసే స్టాఫ్‌నర్సులకు నెలకు రూ.29,900 చొప్పున జీతాన్ని చెల్లిస్తారు.

* అభ్యర్థులను ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌, బీఎస్సీ, జీఎన్‌ఎంలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 17-09-2022ని చివరి తేదీగా నిర్ణయిస్తారు.

* ఉద్యోగాలకు ఎంపికైన తుది అర్హుల జాబితాను 03-10-2022 తేదీన విడుదల చేస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..