TSPSC: తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో 529 పోస్టులు మంజూరుకు ఉత్తర్వులు జారీ.. త్వరలోనే..

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులక మరో గుడ్‌న్యూస్‌. తాజా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలో కొత్తగా 529 పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ ఎం హన్మంతరావు ఆదేశాలు జారీ చేశారు..

TSPSC: తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో 529 పోస్టులు మంజూరుకు ఉత్తర్వులు జారీ.. త్వరలోనే..
Ts Govt Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 09, 2022 | 2:09 PM

TS Panchayat Raj Recruitment 2022 Notification: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులక మరో గుడ్‌న్యూస్‌. తాజా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలో కొత్తగా 529 పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ ఎం హన్మంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 253, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 173, సూపరింటెండెంట్‌ పోస్టుల 103ను ఉన్నాయి. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. ఈమేరకు జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. జూనియర్ అసిస్టెంట్ పొస్టులను గ్రూప్ 4 కింద భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు లేదా మూడు రోజుల్లోనే గ్రూప్ 4కు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.