AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIM Visakhapatnam Jobs 2022: విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెల జీతం రూ.లక్షకు పైనే..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM Visakhapatnam).. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Professor Postత) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ..

IIM Visakhapatnam Jobs 2022: విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెల జీతం రూ.లక్షకు పైనే..
Iim Visakhapatnam
Srilakshmi C
|

Updated on: Sep 09, 2022 | 9:05 AM

Share

IIM Visakhapatnam Faculty Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM Visakhapatnam).. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Professor Postత) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, పబ్లిక్‌ పాలసీ, ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, మార్కెటింగ్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 3 నుంచి 10 ఏళ్ల టీచింగ్‌ అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 41 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఈమెయిల్‌ విధానంలో అక్టోబర్‌ 10, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అనంతరం హార్డ్‌కాపీలను కింది అడ్రస్‌కు అక్టోబర్‌ 10, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.70,900ల నుంచి రూ.1,44,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఈ మెయిల్‌ ఐడీ: acultyrecruit2022sepsrd@iimv.ac.in

అడ్రస్‌: THE SENIOR ADMINISTRATIVE OFFICER INDIAN INSTITUTE OF MANAGEMENT VISAKHAPATNAM ANDHRA UNIVERSITY CAMPUS VISAKHAPATNAM – 530 003 ANDHRA PRADESH, INDIA.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.