SAI Jobs 2022: క్రీడా మంత్రిత్వశాఖలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల.. అర్హతలివే..
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్రాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 93 పెర్ఫామెన్స్ అనలిస్ట్ పోస్టుల (Performance Analyst posts) భర్తీకి..
SAI Performance Analyst Recruitment 2022: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్రాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 93 పెర్ఫామెన్స్ అనలిస్ట్ పోస్టుల (Performance Analyst posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఫిజియోథెరపీ/స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ సైన్స్/స్పోర్ట్స్ సైన్స్/ స్పోర్ట్స్ కోచింగ్ అండ్ ఎక్సర్సైజ్ సైన్స్/ఫిజికల్ ఎడ్యుకేషన్/మెడికల్/హ్యూమన్/స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ/లైఫ్ సైన్స్/బయోలాజికల్ సైన్సెస్/సైకాలజీ/బయోమెకానిక్స్/ఫుడ్ సైన్స్/ఫుడ్ సైన్స్/న్యూట్రిషన్/ఆంత్రోపాలజీ స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. సంబంధత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 30, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 12, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి రాత పరీక్షలేకుండానే.. అంటే అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి నెలకు రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలుజజ
- ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 20
- స్ట్రెంథ్ & కండిషనింగ్ ఎక్స్పర్ట్ పోస్టులు: 20
- ఫిజియాలజిస్ట్ పోస్టులు: 10
- సైకాలజిస్ట్ పోస్టులు: 10
- బయోమెకానిక్స్ పోస్టులు: 10
- న్యూట్రీషనిస్ట్ పోస్టులు: 10
- ఆంత్రోపోమెట్రిస్ట్ పోస్టులు: 10
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.