AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime News: భర్త తలపై సలసల కాగే నూనె పోసిన భార్య.. ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో..

పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకునన్న అతను భార్య, పిల్లలను నిర్లక్షం చేశాడు. ఎంత చెప్పిన వినని భర్తతో విసిగిపోయిన భార్య క్షణికావేశంలో సలసలకాగే వేడి నూనె భర్తపై పోసింది. తీవ్ర గాయాలపాలైన భర్త..

Hyderabad Crime News: భర్త తలపై సలసల కాగే నూనె పోసిన భార్య.. ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో..
Heat Oil
Srilakshmi C
|

Updated on: Sep 07, 2022 | 11:14 AM

Share

Telangana Crime News: పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకునన్న అతను భార్య, పిల్లలను నిర్లక్షం చేశాడు. ఎంత చెప్పిన వినని భర్తతో విసిగిపోయిన భార్య క్షణికావేశంలో సలసలకాగే వేడి నూనె భర్తపై పోసింది. తీవ్ర గాయాలపాలైన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన కుల్సుంపురా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన చెందిన గిరిధర్‌లాల్‌, రేణుక దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. వీరు మూడేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌ నగరంలోని జియాగూడకు వచ్చి నివాసం ఉంటున్నారు. మాంసం వ్యాపారం నిర్వహించే గిరిధర్‌లాల్‌ జియాగూడ కబేళాలో పని చేస్తూ ఉండేవాడు. ఐతే గత కొంత కాలంగా గిరిధర్‌లాల్‌ పరాయి స్త్రీల వ్యామోహంలో పడి భార్యాపిల్లలను పట్టించుకోవడం మానివేశాడు. 5 నెలలుగా ఓ మహిళ వద్ద ఉంటూ.. మూడు రోజుల కిందట భార్య వద్దకు వచ్చాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గత మూడు రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 6వ తేదీన ఉదయం వారిద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య రేణుక క్షణికావేశంలో వంటింట్లో కడాయిలో ఉన్న వేడి నూనెను భర్త తలపై పోసింది. గిరిధర్‌లాల్‌ తల, ఛాతీ, చేతులకు తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. గతంలో కూడా రేణుక భర్తపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విచారణలో బయటపడింది.