IIT-Hyderabad: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య.. హోటల్ భవనం పై నుంచి దూకి..
బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న మెఘ్‌కపూర్ సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని ఓ హోటల్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థి మేఘాకపూర్ స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్ పూర్.
IIT-Hyderabad Student Suicide: ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో వారం వ్యవధిలోనే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పోతిరెడ్డిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న మెఘ్‌కపూర్ సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని ఓ హోటల్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థి మేఘాకపూర్ స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్ పూర్. అతని తండ్రి బిజినెస్ మేన్ అని అధికారులు పేర్కొంటున్నారు. IIT హైదరాబాద్‌లో మూడు నెలల క్రితమే B.TECH పూర్తి చేసిన మేఘాకపూర్.. 3 నెలల నుంచి సంగారెడ్డి లోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.
ఇదిలాఉంటే.. ఆగస్టు 31 ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి క్యాంపస్ రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా.. రాహుల్ అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే, రాహుల్ ఎలా మృతి చెందాడన్న విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. రాహుల్ మృతిచెందిన 8 రోజులకే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ ఐఐటీలో ఆందోళన నెలకొంది. ఐఐటీ హైదరాబాద్‌లో అంతకుముందు కూడా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..