Women Health: మహిళలకు వరం దాల్చిన చెక్క.. ఇలా ఉపయోగిస్తే అలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
మసాలా దినుసు దాల్చిన చెక్క ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక సమస్యల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే మహిళలు దాల్చిన చెక్కను క్రమంగా తీసుకుంటే
Cinnamon benefits for women: వంటగదిలో ఎన్నో దివ్య ఔషధాలు దాగున్నాయి. వీటిని ఉపయోగించి ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను అధిగమించవచ్చు. అలాంటి ఔషధాల్లో దాల్చినచెక్క ఒక్కటి.. మసాలా దినుసు దాల్చిన చెక్క ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక సమస్యల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే మహిళలు దాల్చిన చెక్కను క్రమంగా తీసుకుంటే పీరియడ్స్ కలిగే సమస్యలను అధిగమించడమే కాకుండా, PCOD వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో దాల్చిన చెక్కతో ఏ సమస్యలను అధిగమించవచ్చో మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. దాల్చిన చెక్కను మీ ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు.. మహిళల్లో ఎలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
- పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు నొప్పి, కడుపులో తిమ్మిర్లు వంటి సమస్యలను మహిళలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో దాల్చినచెక్కను ఉపయోగించడం వల్ల కడుపులో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలు దాల్చిన చెక్క టీ లేదా దాల్చిన చెక్క నీటిని తీసుకోవచ్చు.
- నేటి కాలంలో మహిళల్లో పీసీఓడీ సమస్య సర్వసాధారణమైపోతోంది. ఈ సమస్య హార్మోన్లకు సంబంధించినది. ఈ సమస్య వచ్చినప్పుడు ఒత్తిడితో పాటు పీరియడ్స్ సక్రమంగా రాని సమస్యను కూడా మహిళలు ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో దాల్చినచెక్క ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
- మెనోపాజ్ కారణంగా మహిళలు తరచుగా చిరాకు, టెన్షన్, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో మహిళలు దాల్చిన చెక్కను తీసుకుంటే రుతువిరతి సమయంలో కూడా వివిధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
గమనిక – మహిళలు తమ ఆహారంలో దాల్చిన చెక్కను చేర్చుకోవచ్చు. అయితే మహిళలకు మరేదైనా అనారోగ్య సమస్య ఉంటే దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చుకునే ముందు ఒకసారి నిపుణుల సలహా తీసుకోడవడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..