Fig For Health: అంజీర్ పండుతో ఆ సమస్యలన్నింటికీ చెక్.. ఎప్పుడు, ఎన్ని తింటే మంచిదో తెలుసుకోండి..
అంజీర్ పండ్లను ఆహారంలో చేర్చుకునే వారు బరువు తగ్గడం చాలా సులభమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంజీర పండ్లను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
Fig For Health: ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది ఎన్నో పోషకాలున్న నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటారు. కానీ.. చాలా తక్కువ మంది మాత్రమే అత్తి పండ్లను తింటారు. అంజీర్ ఆరోగ్యకరమైన, రుచికరమైన డ్రై ఫ్రూట్. స్థూలకాయాన్ని తగ్గించే ఎన్నో పోషకాలు అత్తి పండ్లలో ఉన్నాయి. అంజీర్ పండ్లను ఆహారంలో చేర్చుకునే వారు బరువు తగ్గడం చాలా సులభమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంజీర పండ్లను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంకా ఎముకలు కూడా బలపడతాయి. అత్తి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలకు అత్తిపండ్లు మంచి మూలం. అంజీర్‌లో శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. స్టామినా పెరగడానికి అంజీర పండ్లను క్రమంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అత్తి పండ్లను ఎలా, ఎంత పరిమాణంలో తినాలి..?
ఒక రోజులో 2-3 అత్తి పండ్లను తినాలి. వీటిని చలికాలంలో పొడిగా తినవచ్చు. కానీ వేసవిలో మాత్రం నీటిలో నానబెట్టిన అత్తి పండ్లను తింటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఇంకా పాలలో కూడా ఫిగ్స్ కలుపుకొని తినవచ్చు. అత్తి పండ్లను తినడానికి సరైన మార్గం ఏమిటంటే.. అత్తి పండ్లను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం మంచిది. దీంతో అత్తి పండ్ల పూర్తి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
- అత్తి పండ్లను తినడం వల్ల జీవక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. జీవక్రియను మెరుగుపరి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
- విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఈ అత్తి పండ్లలో ఎన్నో పోషకాలున్నాయి. ఇవి కొవ్వును సైతం తగ్గించడంలో సహాయపడతాయి.
- అత్తిపండ్లు ఫైబర్ కు మంచి మూలం. దీని కారణంగా మీ పొట్ట ఫిట్‌గా ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
- అత్తి పండ్లలో ఫిసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. దీంతో పొట్ట కొవ్వు తగ్గుతుంది.
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అత్తి పండ్లలో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యవంతంగా చేస్తాయి.
- మధుమేహ రోగులు తీపి తినడానికి బదులు అత్తి పండ్లను తీసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..