Watch Video: ప్రశ్నించిన మ‌హిళ‌తో బీజేపీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన.. పేపర్లు చింపి, అరెస్టు చేయాలంటూ ఆదేశం.. వీడియో వైరల్..

ఎమ్మెల్యే అర‌వింద్ లింబావ‌లి.. తనను కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకునేలా ఆదేశించి.. కెమెరాకు చిక్కారు.

Watch Video: ప్రశ్నించిన మ‌హిళ‌తో బీజేపీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన.. పేపర్లు చింపి, అరెస్టు చేయాలంటూ ఆదేశం.. వీడియో వైరల్..
Aravind Limbavali
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 04, 2022 | 9:06 AM

Karnataka BJP MLA Aravind Limbavali: ఆయనొక ప్రజాప్రతినిధి.. ప్రజా సమస్యలను ఎంతో సహనంతో వినాల్సిన ఆయన.. ఒక్కసారిగా తన ప్రవర్తను మార్చుకున్నారు.. ఏదో విషయంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించారు.. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. కర్ణాటక మ‌హ‌దేవ‌పుర ఎమ్మెల్యే అర‌వింద్ లింబావ‌లి.. తనను కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకునేలా ఆదేశించి.. కెమెరాకు చిక్కారు. ఈ వీడియోలో ఎమ్మెల్యే అర‌వింద్ లింబావ‌లి.. మహిళపై ఎమ్మెల్యే అరుస్తుండటం.. పేపర్ గుంజుకునేందుకు ప్రయత్నించడం అంతా.. వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే ఆ మహిళను బెదిరించారు. బెంగుళూరులో నీటి ఎద్దడి సమస్యలను పర్యవేక్షించేందుకు ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో.. మహిళ ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది.

వీడియోలో మహిళ మహదేవపుర ఎమ్మెల్యే వద్దకు చేరుకుని అతనికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. అయితే రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఆమెపై అరుస్తూ దురుసుగా మాట్లాడుతూ.. ఆ మహిళ చేతిలోని తిరగబడి చింపేశారు. అంతేకాకుండా ఆమెను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఆమెను అక్కడినుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనపై విపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఎమ్మెల్యే తీరుపు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. మహిళతో అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి.. 

ఇదిలాఉంటే.. జూన్‌లో లింబావలి కుమార్తె కూడా బెంగుళూరులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించి.. ఆపై అధికారులను దుర్భాషలాడింది. దీంతోపాటు ఈ ఘటన మొత్తాన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ జర్నలిస్టుపై కూడా కర్ణాటక ఎమ్మెల్యే కూతురు దాడి చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్యే క్షమాపణలు కొరిన మూడు నెలల తర్వాత.. తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..